ప్రియుడు నిర్మాతగా నయనతార క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్ హీరో విలన్‌గా
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న నయనతార మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమైంది. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే తమిళ థ్రిల్లర్ సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాను నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ నిర్మించడం విశేషంగా మారింది. సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా నటించిన గృహం అనే సినిమాకు గతంలో మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
తాజా చిత్రం కోసం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న సెక్రెడ్ గేమ్స్ చిత్రంలో మాల్కమ్ మౌరాద్ పాత్రలో నటించిన ల్యుక్ కెన్నీను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ల్యుక్ కెన్నీ విలన్‌గా నటిస్తారు. ఇంకా పేరు పెట్టని చిత్రంలో నయనతార లీడ్‌గా నటిస్తుండగా, కుక్క ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.

ఇటీవల కాలంలో నయనతార థ్రిల్లర్ మూవీలో నటించి మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. నోడిగల్ ఐరా, కలైయుతీర్ కాలమ్ తదితర చిత్రాల్లో నటించింది. ఆరంభం అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటించారు.
ప్రస్తుతం నయనతార కెరీర్ విషయానికి వస్తే, చిరంజీవితో సైరాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్బార్‌లో, ఇళయ దళపతి విజయ్, శివకార్తికేయన్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నది. సైరా విడుదలకు సిద్ధమవుతుండగా, దర్బార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











