విడాకుల బాటలో నయనతార? పెళ్లి చేసుకుని తప్పుచేశానంటూ షాకింగ్ పోస్ట్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీలంతా విడాకుల వార్తలతో బాంబు పేలుస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి షాక్ ఇస్తారోనని సినీ వర్గాలు, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్స్ తమ జీవిత భాగస్వాముల ఫోటోలు తొలగించినా, ఇంటి పేరు మార్చినా, జీవితంపై వైరాగ్యంతో ఉన్న పోస్టులు పెట్టినా జనానికి ఎక్కడో తేడా కొడుతోంది. తాజాగా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా, లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది.

20 ఏళ్లుగా నెంబర్‌వన్ హీరోయిన్‌గా
దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా కెరీర్ సాగిస్తున్నారు నయనతార. స్టార్లను మించిన ఫాలోయింగ్, క్రేజ్‌తో అవసరమైతే వారే తన కోసం వెయిట్ చేసేలా చేసుకున్నారంటే నయన్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి రారని, అటిట్యూడ్ చూపిస్తుందని విమర్శలు వచ్చినా నయనతార మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఆమె డేట్స్ కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. తన నటనతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ జనరేషన్‌లో కేరాఫ్‌గా నిలిచి లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు నయన్.

Nayanthara Vignesh Shivan Divorce lady superstar s latest post sparks divorce rumours

నయన్ డైరీ ఫుల్
భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ లేనంత బిజీగా నయనతార ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీలో, యశ్ నటిస్తోన్న టాక్సిక్‌లో, మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, పెట్రియాట్, మూకుతి అమ్మన్ 2, హాయ్, రక్కాయే సినిమాలలో నయనతార నటిస్తున్నారు. ఇవికాక మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగానూ మరి అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో కోట్లలో సంపాదిస్తున్నారు లేడీ సూపర్‌స్టార్.

శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం
శింబు, ప్రభుదేవాలతో డేటింగ్ చేసిన నయనతార వారితో పెళ్లి వరకు వెళ్లారు. కానీ ఈ రెండు సందర్భాలలోనూ బ్రేకప్స్ జరిగి నయనతార డిప్రెషన్‌లోకి వెళ్లారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి తిరిగి నటనపై ఫోకస్ పెట్టిన నయనతార బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టారు. ఈ క్రమంలో నానుమ్ రౌడీ ధాన్ సినిమా సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నయనతార.. ప్రస్తుతం భర్త, పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఎంజయ్ చేస్తున్నారు.

Take a Poll

నయనతార - విఘ్నేష్ శివన్ విడిపోతున్నారా?
ఇలాంటి దశలో నయన్ చేసిన ఓ పోస్ట్ చిత్ర పరిశ్రమకు షాకిచ్చింది. ఓ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు.. పెళ్లి అనేది ఓ పెద్ద పొరపాటు. నీ భర్త చేసే పనులకు నువ్వు రెస్పాన్సిబిలీటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మగవాళ్లు సహజంగానే పరిణితి చెందినవాళ్లు కాదు.. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను మీ వల్ల ఎన్నో ఎదుర్కొన్నానని పేర్కొంది. అయితే ఆ పోస్ట్‌ను నయనతార క్షణాల్లోనే డిలీట్ చేసినప్పటికీ దీనికి తాలుకా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నయనతార - విఘ్నేష్ శివన్ మధ్య గొడవలు జరుగుతున్నాయా? విఘ్నేష్‌తో నయన్ విడిపోతున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనిని మార్ఫింగ్ చేశారని, నయనతార- విఘ్నేష్‌లు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని చెబుతున్నారు. దీని వెనుక అసలు నిజం ఏంటో తెలియాలంటే నయన్, విఘ్నేష్‌లు స్పందించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X