Nayanthara: నయనతార కవల పిల్లలను చూశారా?.. వైరల్ వీడియో ఇదిగో!

ఇటీవల సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట అక్టోబర్ 9న ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరు చేసుకున్న సరోగసి పద్దతి సరైన క్రమంలో, నియమనిబంధనలకు లోబడే జరిగిందా అనే విషయాన్ని విచారించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను రెడీ చేసిన కమిటీ రేపు సమర్పించనుందని టాక్. అయితే దీపావళి పండుగ సందర్భంగా నయన్-విఘ్నేష్ దంపతులు పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

పెళ్లయిన నాలుగు నెలలకే..

పెళ్లయిన నాలుగు నెలలకే..

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు అక్టోబర్ 9న ట్విన్స్ బేబీ బాయ్స్ ఉయిర్, ఉలగమ్ కు జన్మనిచ్చామని అభిమానులకు శుభవార్త అందించారు. ఈ శుభవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో నయన్ దంపతులను ఆశీర్వదించారు. తర్వాత పెళ్లయిన నాలుగు నెలలకే ఎలా జన్మనిచ్చారన్న వార్తలు తెగ హైలెట్ అయ్యాయి.

దీంతో నయన్ దంపతుల సరోగసీ విధానం రూల్స్ ప్రకారం జరిగిందా లేదా అనే విషయంపై తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. ఈ విచారణకు రేపు ఒక క్లారిటీ రానుంది. అయితే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు దివాళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

కవల పిల్లలను ఎత్తుకుని..

దివాళి పండుగ సందర్భంగా సెలబ్రిటీలందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగానే నయన్ దంపతులు సైతం దీపావళి విషెస్ అందించారు. నయనతార, విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలను ఎత్తుకుని దివాళి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా చెబుతున్న వీడియోను విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోలో తమ పిల్లల ముఖాలను మాత్రం చూపించలేదు. ఇటీవల సెలబ్రిటీలు తమ పిల్లల మొహాలను చూపించకుండా ఊరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నయన్, విఘ్నేష్ దంపతులు కూడా చేరారని అనుకోవచ్చు.

ప్రేమ మరింత బలంగా ఉంటుంది..

ఇక విఘ్నేష్ శివన్ షేర్ చేసిన వీడియోకు ''మీ అందరికీ దివాళి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలి. ప్రేమ ఒక్కటే జీవితాన్ని సంతోషంగా మార్చగలదని గుర్చుంచుకోవాలి. ప్రేమలో విశ్వాసంతోపాటు మంచితనం కూడా ఎప్పుడూ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ మరింత బలంగా ఉంటుంది అని రాసుకొచ్చాడు'' విఘ్నేష్ శివన్. అలాగే ఈ వీడియోతో పాటు కొన్ని ఫొటోలను సైతం ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు ఈ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ప్రస్తుతం ఈ వీడియోతోపాటు ఫొటోలు కూడా వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X