twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫన్నీ వీడియో : కరోనా వార్తలను ఖండించిన నయన్-విఘ్నేశ్..ఇలాంటి రూమర్స్‌ను అలా ఎంజాయ్ చేస్తారట

    |

    నయనతార-విఘ్నేశ్ శివన్ జంట గురించి అందరికీ తెలిసిందే. అయితే సడెన్‌గా నిన్న ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. విఘ్నేశ్ శివన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. విఘ్నేశ్‌కు వచ్చిందంటే నయనతారకు కూడా వచ్చి ఉంటుందని రూమర్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై నయన్ విఘ్నేశ్ వెరైటీగా స్పందించారు. తాము రూమర్స్‌ను ఇలాగే ఎంజాయ్ చేస్తామంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. దీంట్లో వీరిద్దరు చిన్న పిల్లల్లా మారిపోయారు. అసలు ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

    Recommended Video

    కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
    కరోనా విజృంభణ..

    కరోనా విజృంభణ..

    తమిళనాడులో కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా చెన్నైలో కరోనా రోజురోజుకూ తాండవం చేస్తోంది. చెన్నైలో కరోనా కేసులను అదుపు చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసింది.

    అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి..

    అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి..

    కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు సినిమా, సీరియల్ షూటింగ్‌లకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వారం రోజుల పాటు సందడిగా షూటింగ్‌లు జరిగాయి. కానీ కరోనా రోజురోజుకూ విస్తరిస్తూ ఉండటంతో అన్నీ అనుమతులను రద్దు చేశారు. షూటింగ్‌లో పాల్గొనడం వల్ల విఘ్నేశ్‌కు కరోనా సోకిందనే రూమర్స్ బయటకు వచ్చాయి.

    అవాస్తవ వార్తలు..

    అవాస్తవ వార్తలు..

    విఘ్నేశ్ శివన్‌కు కరోనా టెస్టులు చేశారని, పాజిటివ్ అని తేలిందని వార్తలు వచ్చాయి. ఆపై కొద్ది సేపటి ఆ వార్తలు అవాస్తమని తేలిపొయాయి. అయితే అప్పటికే నయన్, విఘ్నేశ్‌లకు కరోనా సోకిందనే వార్త దావానంలా వ్యాప్తి చెందింది. ఇలాంటి రూమర్లను ఎలా చేస్తామో చూడండి అంటూ ఆ ఇద్దరు ఓ వీడియోను షేర్ చేశారు.

    చిన్న పిల్లల్లా మారిపోయారు..

    చిన్న పిల్లల్లా మారిపోయారు..

    ఓ యాప్ ద్వారా నయనతార, విఘ్నేశ్ ఇద్దరూ కూడా చిన్న పిల్లల్లా మారి వెక్కిరించసాగారు. అందంగా ముద్దు ముద్దుగా డ్యాన్సులు వేశారు. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ‘చూశారా మాపై వచ్చే రూమర్స్‌పై మేము ఎలా రియాక్ట్ అవుతామో.. కరోనా వచ్చిందని ప్రెస్, సోషల్ మీడియా మీ ఊహకు వచ్చినట్టుగా రాశారు. ఏది ఏమైనా.. మా శ్రేయోభిలాషులకు చెబుతున్నా.. మేము ఆనందంగానే ఉన్నాం..మాకు దేవుడు కావాల్సినంత శక్తిని ఇచ్చాడు మీ జోకులను చూడటానికి గాడ్ బ్లెస్' అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Nayanthara Vignesh shivan Funny Video On Corona rumors. nd .., that’s how we see the news about us, the corona and the imagination of all the press & social media sweethearts
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X