ఏఆర్ రెహమాన్‌ను కలిసిన లవ్ బర్డ్స్ నయనతార-విఘ్నేష్ శివన్

By Bojja Kumar
 Nayanthara and Vignesh Shivan meet AR Rahman in Los Angeles

లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం యూఎస్ఏలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లోతీ కోచెల్లా మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను విజిట్ చేసిన అనంతరం అక్కడ ఏఆర్ రెహమాన్‌ స్టూడియోకు వెళ్లి మ్యూజిక్ మాంత్రికుడిని కలిసిశారు. నేషనల్ అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.

రెహమాన్‌ను కలిసిన ఫోటోను విఘ్నేష్ శివన్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పాటు తమ యూఎస్ఏ ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా..... నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు 'ఇమైక్క నోడిగల్' అనే తమిళ చిత్రం చేస్తోంది. మలయాళం థ్రిల్లర్ మూవీ 'కొట్టాయమ్ కుర్బానా' సినిమాకు సైన్ చేసింది. త్వరలో ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఖాళీ...ఆయన దర్శకత్వంలో సూర్య నటించిన 'గ్యాంగ్' మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

నయనతార-విఘ్నేష్ శివన్ రిలేషన్‌షిప్ విషయానికొస్తే..... ఇద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. 2015లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన 'నానుమ్ రౌడీ ధాన్' అనే సినిమాలో నయనతార నటించింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుండి ఇద్దరూ సీరియస్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X