హాట్ టాపిక్‌గా నయనతార పెళ్లి వార్తలు.. విగ్నేష్ శివన్ ఏం చెప్పాడంటే!
Recommended Video

నయనతార ప్రస్తుతం దక్షిణాదిలో లేడి సూపర్ స్టార్. అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ ఆమె. వయసు పెరుగుతున్న నయన్ అందం తరగడంలేదు. అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ పాత్రలతో నయనతార దూసుకుపోతోంది. చాలా కాలంగా నయనతార, కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ
నయనతార, విగ్నేష్ శివన్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. పబ్లిక్ గానే ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరగడం గమనిస్తూనే ఉన్నాం. దీనితో నయనతార, విగ్నేష్ పెళ్లి గురించి మీడియాలో ఊహాగానాలు మొదలైపోతున్నాయి.

భక్తి యాత్రలు
విదేశాలలో రొమాంటిక్ టూర్ లు కడుతూ ప్రేమలో విహరించిన నయన్, విగ్నేష్ జంట తాజాగా భక్తి యాత్రలు మొదలు పెట్టారు. ఇటీవల వీరిద్దరూ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉన్నట్లుండి భక్తి యాత్రలు మొదలు పెట్టడంతో ఈ జంట త్వరలో వివాహం చేసుకోబోతోంది అనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది.

ఆసక్తికరంగా విగ్నేష్ సమాధానం
ఇటీవల విగ్నేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నయన్ తో పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ విషయంలో మొదట నయనతారనే అడగాలి. ఆ తరువాత మా అమ్మని అడగాలి అంటూ చమత్కరించాడు.

సినిమాలు చేస్తూనే
నయనతారకు ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా దూసుకుపోతోంది. నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి వ్యవహారాలు మొదలవుతున్నాయనే గుసగుసలు తమిళ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా నయన్ సినిమాలలో కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











