అజ్మీర్ దర్గాలో సందడి చేసిన నయనతార
నయనతార, వేలైకారన్ మూవీ టీమ్ రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు.
హీరోయిన్ నయతార ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న వేలైకారన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న సమీపంలోనే ప్రఖ్యాతిగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గా ఉండటంతో చిత్ర యూనిట్ అంతా వెళ్లి దర్గాను సందర్శించారు.
సినిమా ఇండస్ట్రీ వారికి ఈ దర్గా అంటే చాలా సెంటిమెంట్. బాలీవుడ్లో చాలా మంది స్టార్స్ తమ సినిమా విడుదల ముందు సెంటిమెంటుగా ఈ దర్గాను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే వేలైకారన్ సినిమా యూనిట్ కూడా దర్గాను సందర్శించారు.

నయనతారతో పాటు ఈ సినిమాకు స్టైలిస్ట్‌గా పని చేస్తున్న కోన నీరజ కూడా ఈ దర్గాను సందర్శించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దర్గాను విజిట్ చేయాలని ప్లాన్ చేసింది నయనతార అని, ఆమెకు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.

ఇంతకు ముందు ఈ దర్గాను ఏఆర్ రెహమాన్, మహేష్ బాబు, వివి వినాయక్ లాంటి తెలుగు స్టార్లు సందర్శించారు.


Click it and Unblock the Notifications











