3 సెకన్లకు రూ. 10 కోట్లు.. ధనుష్‌పై నయనతార ఫైర్ ..
కోలీవుడ్ స్టార్ ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తనపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొంది. ఈ మేరకు మూడు పేజీల నోట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయనతార. దీంతో ఈ సెలబ్రెటీల వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది ? వీరి మధ్య వివాదం తలెత్తడానికి గత కారణమేంటీ? నయన తార బహిరంగంగా లేఖ రాయడానికి గల కారణాలేంటీ?
స్టార్ హీరోయిన్ నయనతార తన జీవితం, ప్రేమ, పెళ్లి వంటి విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో తన డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. ఈ మేరకు నయనతార డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడి వరకూ అంత బాగానే ఉన్నా.. ఈ డాక్యుమెంటరీలో నయనతార, విజయ్ సేతుపతి జంటగా 'నానున్ రౌడీ దాన్' (నేను రౌడీనే) అనే సినిమాను సంబంధించిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు.

ఈ మూవీని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా.. హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ టైమ్ లోనే నయన్- విగ్నేష్ ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లి 2022లో జరిగిన విషయం తెలిసిందే. అయితే.. నయన్ విగ్నేష్ కలయికను కారణమైన నానున్ రౌడీ దాన్' (నేను రౌడీనే) అనే సినిమాలోని 3 సెకన్ల వీడియో క్లిప్ ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీంతో అసలు వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. ఈ మేరకు కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు పంపించారు. ఒక్కటి కాదు రెండు కాదు..ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు ధనుష్..
ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన హీరోయిన్ నయనతార .. హీరో ధనుష్ పై పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో నయనతార ఇలా పేర్కొంది. " మీ తండ్రి, సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో అయిన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు. ఎలాంటి సపోర్టు లేకుండా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నేను ఎంతోగానో పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో నా వృత్తికి, నన్ను ఆరాధిస్తున్న అభిమానులకు నేను సర్వదా రుణపడి ఉంటా. నా జీవితాన్ని ఆధారంగా రూపొందిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం.. కేవలం నేను మాత్రమే కాదు ఎంతో మంది సినీ లవర్స్, ఫ్యాన్ ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఆత్మీయుల సహకారంతో ఈ డాక్యుమెంట్ ను రూపొందించాం. ' అని పేర్కొన్నారు.
నయనతార ఇంకా కంటిన్యూ చేస్తూ.. 'మీరు మాపై ప్రతీకార పూర్వకంగానే దాడి చేస్తున్నట్టు అర్థమవుతోంది. కేవలం మమ్మల్ని మాత్రమే కాదు.. ఇందులో భాగస్వామ్యం అయినా.. వారందర్నీ ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. నా సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీని రూపొందించాం.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన 'నానుమ్ రౌడీ దాన్' మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం' అని పేర్కొన్నారు.
#SpreadLove and Only Love 🫶🏻 pic.twitter.com/6I1rrPXyOg
— Nayanthara✨ (@NayantharaU) November 16, 2024
' నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి ఎన్‌వోసీ(NOC) కోసం దాదాపు 2 సంవత్సరాల నుంచి అభ్యరిస్తున్నాం. కేవలం 3 సెకన్ల వీడియో క్లిప్ కోసం రూ.10 కోట్లు కట్టాలా..? ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలోనే మీ ఆమోదం కోసం ఎదురు చూశాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు అనుమతి ఇవ్వకపోవడంతో మళ్లీ ఎడిట్ చేసి విడుదల చేస్తాం. మీరు ఆ పాటలు వాడుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకపోవడంతో నా హార్ట్ బ్రేక్ అయింది. " అంటూ నయనతార బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











