నయనతార పవిత్రురాలా?...మరో హీరోయిన్ వార్నింగ్
చెన్నై: ధనుష్ హీరోగా తెరకెక్కిన 'నైయాండి' అనే తమిళ మూవీలో హీరోయిన్‌గా నటించిన నజ్రియా నజీమ్....సినిమాలోని బొడ్డు సీన్ విషయంలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. నజ్రియా అలా చేయడంపై ఆమధ్య నయనతార స్పందిస్తూ సిల్లీ గర్ల్ అంటూ కామెంట్ చేసింది.
బొడ్డు సీన్ విషయంలో తన చర్యను ఇప్పటిక బలంగా సమర్థించుకుంటున్న నజ్రియా... నయనతార తనపై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతోంది. 'నాపై కామెంట్స్ చేయడానికి నయనతార ఎవరు? నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు ఆమె సలహాలు అవసరం లేదు. నయనతార ఎలాంటిదో(రియల్ లైఫ్‌లో) అందరికీ తెలుసు, నన్ను విమర్శించే అర్హత ఆమెకు లేదు' అంటూ నజ్రియా మండి పడింది.
నయనతార రియల్ లైఫ్‌లో అంత పవిత్రురాలేం కాదు అని పరోక్షంగా విమర్శించింది నజ్రియా. అంతే కాకుండా తన వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోకుండా నీ పని నువ్వు చేసుకోవాలని పరోక్షింగా వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి నజ్రియా వ్యాఖ్యలపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.
నజ్రియా ప్రస్తుతం సలాలా మొబైల్స్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె షాహానా అనే ముస్లిం గర్ల్ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వయంగా ఓ పాటను కూడా పాడుతోంది. నజ్రియా ఇప్పటికే పలు స్టేజీ షోలలో సింగర్‌గా తనను తాను నిరూపించుకుంది.


Click it and Unblock the Notifications












