ఆమె చాలా హాట్ హాట్ అందుకే ఆయన తో మిడ్ నైట్ మసాలా!?
కొంతమంది చిన్నపిల్లలు ఎంతసేపు ఆడుకున్నా అలసిపోరు. ఇంకా ఇంకా ఆడుకోవాలనే వారి మనసు కోరుకుంటుంది. అటువంటి పిల్లల కోసం తెలుగులో ప్రత్యేకంగా పదాలేమీ లేవుకాని, తమిళంలో మాత్రం ఓ పదముంది. 'తీరాద విలయాట్టు పిళ్లై". 'ఎంతసేపు ఆడినా తనివితీరని పిల్లగాడు" అని ఆ పదానికి అర్ధం. ఆ అర్ధానికి ద్వంద్వార్ధం తీస్తూ తమిళంలో ఓ చిత్రం రూపొందుతోంది. విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కావడం ఖాయం.
తెలుగులో బహుశా 'చిలిపి కృష్ణుడు" అనో లేక 'కొంటె కృష్ణుడు" అనో పేరు పెడతారేమో! విశాల్ సరసన తనుశ్రీ దత్తాతోపాటు నీతూచంద్ర కూడా నటిస్తోంది. తెలుగులో 'గోదావరి", 'సత్యమేవజయతే" చిత్రాలలో నటించిన ఈ భామ 'తీరాద విలయాట్టు పిళ్లై" చిత్రం కోసం చాలా హాట్ హాట్‌గా నటించి అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఘాటైన గుంటూరు మిర్చిలాంటి ఈ బుల్లి..ఓ టబ్ నిండా గుంటూరు మిరపకాయల్ని నింపుకుని, తన ఒంటిని కూడా వాటితోనే సింగారించుకుని ఓ సన్నివేశంలో నటించి చూపరుల ఒంటికి కారం పూసుకున్నంత వేడి రగిలించనుంది. ఆ మాటకొస్తే.. హాటు హాటు ఫోటో సెషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలకెక్కుతుండడం నీతూకు అలవాటే! అంతే కాకుండా హిందీలో విడుదలైన '13బి" ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం లో తమిళంలో కూడా 'యావరుమ్ నలమ్" గా విడుదలై మంచి సక్సెస్ నే సాధించింది. ప్రస్తుతం తెలుగులో 'పదమూడు"గా రూపొందుతోంది. మరి అందులో మాధవన్ తో నీతు చంద్ర చేసిన మిడ్ నైట్ మసాలాలాంటి సాంగ్ మాత్రం కుర్రకారుని వెర్రెత్తిస్తుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











