బాలీవుడ్ కి హీరో..మనకు విలన్
చెన్నై : లికా ప్రొడక్షన్ బ్యానరుపై కరుణామూర్తి, సుభాష్ సంయుక్త నిర్మాణంలో 'ఇలయ తలబది' విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'కత్తి'. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. అనిరుధ్ స్వరాలు కూర్చారు. తొలిసారిగా వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది. 'తుప్పాక్కి' అనంతరం విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంలో అభిమానులు, ప్రేక్షకులలో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముకేష్ విలన్‌గా నటించారు.
దీనిగురించి ఆయన మాట్లాడుతూ.. ''దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలను చూశాను. అద్భుతం అనిపించాయి. ఒక్కో సినిమాలో ఒక్కో ప్రత్యేకత కనిపించింది. 'కత్తి'లో విలన్ నటించాలని అడిగిన వెంటనే ఒప్పుకున్నాను. నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలో నటిచేందుకైనా నటులు ఒప్పుకుంటారు. ఈ సినిమా కోసం పది కిలోల బరువు తగ్గాను. దక్షిణాది సినిమాల్లో ఎప్పటిలా వచ్చే విలన్ పాత్ర కాదిది. భిన్నంగా ఉంటుంది. ఇందులో హీరోగా శారీరకంగా పోరాడను.. తెలివితో పోట్లాడుతా. ఇందులో నటించడం కోసం తమిళం నేర్చుకున్నా. విజయ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవడం అదృష్టంగా భావిస్తున్నాను''అని తెలిపారు.

'తుప్పాక్కి' తర్వాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్.


Click it and Unblock the Notifications











