twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Navarasa Trailer : సూర్య, సేతుపతి, అరవింద్ స్వామి, ఒకరిని మించి ఒకరు.. ఎక్కడా తగ్గలేదుగా!

    |

    సినిమాల కంటే ఎక్కువ జనం వెబ్ కంటెంట్ కి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే బడా దర్శకులు కూడా వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కోవలోనే టాప్ డైరెక్టర్ మణిరత్నం నవరస అనే ఒక ఆంథాలజీ సిరీస్ తెరకెక్కించారు. ఆగస్టు ఆరో తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం పరిశీలిద్దాం.

    మణిరత్నం చేతుల మీదుగా

    మణిరత్నం చేతుల మీదుగా

    నవరస అనే పేరుకు తగ్గట్టే ఈ సిరీస్ లో తిమ్మిది రసాలుగా చెప్పబడే శృంగార, కరుణ, శాంత, హాస్య, అద్భుత, రౌద్ర, వీర, భయానక, బీభత్స లను బేస్ చేసుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన వెబ్‌ సిరీస్‌ నవరస. ఒక్కో పార్ట్ ను ఒక్కో దర్శకుడు తెరకేక్కించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొమ్మిది భాగాల నవరస ఆంథాలజీ సిరీస్ ని ప్రఖ్యాత తమిళ సృష్టికర్తలు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ కలిసి నిర్మించారు. తమిళ్ లో స్టార్లు మరియు కళాకారులను ఒకచోట చేర్చి, భారతీయ సినిమాల్లో గర్వించదగిన సిరీస్ గా దీన్ని రూపొందించారు.

    స్టార్ సాంకేతిక నిపుణులు

    స్టార్ సాంకేతిక నిపుణులు

    అంతే కాక ఈ వెబ్ సిరీస్ కు ఎఆర్ రెహమాన్, గిబ్రాన్, డి ఇమ్మాన్, అరుల్ దేవ్, కార్తీక్, రాన్ ఏతాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్ తదితరులు సంగీతం అందించారు. సంతోష్ శివన్, బాలసుబ్రమణ్యం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయాస్ కృష్ణ బాబు, విరాజ్ సింగ్ తదితరులు సినిమాటోగ్రఫీ అందించారు.

    నటీనటులు దర్శకుల విషయానికి వస్తే

    నటీనటులు దర్శకుల విషయానికి వస్తే

    ఇక ఈ ఆంథాలజీ మేకర్స్ విషయానికి వస్తే ఆంథాలజీ టైటిల్ 1 - ఎనిమీ (మెర్సీ) నటీనటులు- విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేవతి దర్శకుడు - బిజాయ్ నంబియార్. ఆంథాలజీ టైటిల్ 2 - సమ్మర్ ఆఫ్ 92 (కామెడీ) నటీనటులు- యోగి బాబు, రమ్య నంబీసన్ నేదుమూడి వేణు, దర్శకుడు - ప్రియదర్శన్. ఆంథాలజీ టైటిల్ 3 -ప్రాజెక్ట్ అగ్ని (ఆశ్చర్యం) నటీనటులు- అరవింద్ స్వామి, ప్రసన్న, పూర్ణ దర్శకుడు - కార్తీక్ నరేన్. ఆంథాలజీ టైటిల్ 4 - పాయసం (అసహ్యకరమైన) నటీనటులు- ఢిల్లీ గణేష్, రోహిణి, అదితి బాలన్, సెల్ఫీ కార్తీక్ డైరెక్టర్ - వసంత ఎస్ సాయి.

    మరిన్ని వివరాల్లోకి వెళితే

    మరిన్ని వివరాల్లోకి వెళితే

    ఇక ఆంథాలజీ టైటిల్ 5 - శాంతి (శాంతి) నటీనటులు- బాబీ సింహా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మాస్టర్ తరుణ్, డైరెక్టర్ - కార్తీక్ సుపురాజ్. ఆంథాలజీ టైటిల్ 6 - రౌతీరామ్ (కోపం) నటీనటులు- రిత్విక శ్రీరామ్, అభినయ శ్రీ, రమేష్ తిలక్, గీతా కైలాసం, డైరెక్టర్ - అరవింద్ స్వామి. ఆంథాలజీ టైటిల్ 7 - ఇన్మై (ఫియర్) నటీనటులు- సిద్ధార్థ్, పార్వతి తిరువోర్తు, డైరెక్టర్ - రతీంద్రన్ ఆర్ ప్రసాద్. ఆంథాలజీ టైటిల్ 8 - ధైర్య నటులు - అధర్వ, అంజలి, కిషోర్ డైరెక్టర్ - సర్జున్. ఆంథాలజీ టైటిల్ 9 - గిటార్ స్ట్రింగ్ (రొమాంటిక్) నటీనటులు- సూర్య, ప్రయాగ రోజ్ మార్టిన్, దర్శకుడు - గౌతమ్ వాసుదేవ్ మీనన్.

    ఆసక్తికరంగా ట్రైలర్


    ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్‌'లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో ఒకరిని మించి ఒకరు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తం మీద ఒకరిని ప్రత్యేకంగా ప్రస్తావించలేము కానీ ట్రైలర్ మాత్రం సిరీస్ మీద ఆసక్తి రేకెత్తిస్తోంది అని చెప్పక తప్పదు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ను మీరు కూడా చూసేయండి మరి.

    English summary
    The Netflix anthology Navarasa stars Suriya, Vijay Sethupathi, Siddharth, Arvind Swami and many more in prominent roles. here is the full details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X