»   » 'నేటి చరిత్ర' దర్శకుడుకి ఆల్రెడీ దేహశుద్ధి చేసారు...

'నేటి చరిత్ర' దర్శకుడుకి ఆల్రెడీ దేహశుద్ధి చేసారు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మృగం' దర్శకుడు స్వామి తీసిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో 'నేటి చరిత్ర'గా డబ్బింగ్‌ చేసి రిలీజ్ కు రెడీ చేసారు. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం తమిళంలో విడుదలైన తర్వాత అక్కడ ఆ దర్శకుడుకి మహిళా సంఘాల వాళ్ళు దేహశుద్ది చేసారని, ఇక్కడా అటువంటిదే జరిగే అవకాశముందని చెప్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం స్వామి గతంలో తీసిన 'మృగం' చిత్రంలా ఇది కూడా మంచి హిట్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక ఈ 'నేటి చరిత్ర' చిత్రం తన సొంత కోడలను లొంగతీసుకునే ఓ మామ కథ. మిలట్రీ నుంచి ఊరికి వచ్చిన ఆ వ్యక్తి భార్య చనిపోతుంది. కొడుకు దగ్గర చేరతాడు. అప్పటికే కొద్ది రోజుల క్రిందట కొడుక్కి పెండ్లి జరుగుతుంది. తన భార్యతో సరదాగా గడిపే అతను చదువు నిమిత్తం వేరే ఊరు వెళ్ళాల్సి వుంటుంది. కానీ, భార్యను తన తండ్రి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కోడలిని లొంగదీసుకుంటాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక విషయం తెలిసిన కొడుకు తండ్రిని చంపేస్తాడు. ఆ తర్వాత భార్యనూ చంపేస్తాడు. ఇక ఈ చిత్రం మాతృక మలయాళం. మరి తెలుగు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu