Varalaxmi Sarathkumar:ఆంటీ ఎంటీ? అమ్మ అని పిలవలేవా? ఆమె విషయంలో జయమ్మకు కౌంటర్లు

సీనియర్​ హీరో, నటుడు శరత్​ కుమార్​ ఇటీవల పరంపర వెబ్​ సిరీస్​తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది వరకు బన్నీ సినిమాతో టాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన బిజీ ఆర్టిస్ట్​గా రాణిస్తున్నారు. ఇక ఆయన కుమార్తె జయమ్మ (క్రాక్​ మూవీలో పాత్ర పేరు).. అదేనండీ వరలక్షీ శరత్​ కుమార్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రిలాగే ఆమె కూడా తెలుగులో మంచి క్రేజ్​ సంపాదించుకుంది. రవితేజ నటించిన క్రాక్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ సోషల్​ మీడియాలో కూడా యాక్టివ్​గా ఉంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్​ వరలక్ష్మీపై కౌంటర్లు పడేలా చేసింది.

సహాయ నటిగా, లేడీ విలన్​గా హీరోలకు సరిసమానమైన పవర్​ఫుల్​ పాత్రలు ఎంపిక చేసుకుంటూ బిజీ ఆర్టిస్ట్​గా మారిపోయింది వరలక్ష్మీ శరత్​ కుమార్​. తమిళంలో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రాక్ ద్వారా దగ్గరైంది.

 వరుస సినిమాలతో బిజీ..

వరుస సినిమాలతో బిజీ..


తెలుగులో క్రాక్​, నాంది, పక్కా కమర్షియల్​ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక స్టార్​ హీరోయిన్​ సమంత ప్రతిష్టాత్మక చిత్రం యశోదలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు శబరి, వర ఐపీఎస్, హనుమాన్ వంటి తదితర చిత్రాలతో బిజీగా ఉండనుంది.

ముక్కుసూటి మనిషి..

ముక్కుసూటి మనిషి..


కంటెంట్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకునే వరలక్ష్మీ ముక్కుసూటి మనిషి. ఎదైనా కుండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు తన మాటలతో విమర్శలు తెచ్చుకుంటుంది. తాజాగా అలాగే అన్నా ఓ మాటే ఆమెపై ట్రోలింగ్​ జరిగేలా చేసింది.

రాధికతో దిగిన ఫొటో షేర్​..

రాధికతో దిగిన ఫొటో షేర్​..


తాజాగా శరత్​ కుమార్​ భార్య, ఒకప్పటి స్టార్​ హీరోయిన్, నటి రాధిక 60వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా కోలీవుడ్, టాలీవుడ్​ సెలబ్రిటీలు సైతం ఆమెకు బర్త్​డే విషెస్​ తెలియజేశారు. ఈ క్రమంలోనే రాధికతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్​ పెట్టింది జయమ్మ. ​

అందుకు మీరు నిదర్శనం..

అందుకు మీరు నిదర్శనం..


ఈ పోస్ట్​కు ''60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్​ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. అలాగే ఏజ్​ ఈజ్​ జస్ట్​ ఏ నెంబర్​ అనడానికి మీరు ఒక నిదర్శనం. ట్రిప్​ను ఎంజాయ్​ చేయండి. సీ యూ సూన్''​ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్​ చూసిన నెటిజన్లు వరలక్ష్మీపై కౌంటర్లు వేశారు.

అలా పిలవడం ఏంటీ?

అలా పిలవడం ఏంటీ?

రాధికను ఆంటీ అంటావేంటీ? అమ్మను ఆంటీ అని పిలవడం ఏంటీ? అని పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో వరలక్ష్మీకి క్లాస్​ పీకారు. అయితే శరత్​ కుమార్​ మొదటి భార్య కుమార్తె వరలక్ష్మీ అని తెలిసిన విషయమే. రాధికను ఆంటీ అని పిలవడంపై జయమ్మ ఇదివరకు ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది.

 నా తండ్రికి రెండో భార్య..

నా తండ్రికి రెండో భార్య..

''చాలా మంది రాధిక నా తల్లి అంటారు. ఆమె నా తల్లి కాదు. ఆమె నా తండ్రికి రెండో భార్య. ముందు నుంచి రాధికను ఆంటీ అనే పిలుస్తుంటాను. అలా పిలిచినంత మాత్రాన మా మధ్య ఏదో గ్యాప్​ ఉన్నట్లు కాదు. నా కన్న తల్లిని నేను అమ్మ అని పిలవాలి'' అంటూ వరలక్ష్మీ అప్పుట్లో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X