»   » రజనీకి ‘పద్మవిభూషణ్’ ఇవ్వడంపై రచ్చ...

రజనీకి ‘పద్మవిభూషణ్’ ఇవ్వడంపై రచ్చ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల లిస్టులో.... సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్' పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ఇవ్వడంపై తమిళనాట కొందరు విమర్శలు చేస్తున్నారు. కేవలం బీజేపీ రాజకీయ లబ్ది కోసం, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రజనీ అభిమానులను ఆకర్షించడం కోసం ఈ అవార్డు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విమర్శలను ఆ పార్టీ నాయకులు ఖండించారు. సినిమా రంగానికి రజనీకాంత్ చేసిన సేవల పట్ల గౌరవంతోనే కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించింది తప్ప, రాజకీయ లబ్ది కోసం కాదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

New Controversy erupted over Padma Awards to Rajinikanth

ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల వివరాలు...
పద్మ అవార్డులకు ఎంపికైన ఇతర సినీ నటుల వివరాల్లోకి వెళితే..... బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది. బాహుబలి లాంటి భారత దేశం గర్వించదగ్గ సినిమా తీసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కినట్లు స్పష్టమవుతోంది. అదే విధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రా కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

English summary
New Controversy erupted over Padma Awards to Rajinikanth and Former CAG Vinod Rai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu