పర్సనల్ మేకప్‌మెన్‌ చేతిలో నమిత, కిరణ్ రాథోడ్ కిడ్నాప్?

By Srikanya

Kiran Rathod-Namitha
చెన్నై: నమిత, కిరణ్‌ రాథోడ్, కీర్తి చావ్లా ముఖ్యపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం 'బాజా భజంత్రీలు'. మంగై హరిరాజన్ దర్శకత్వంలో ఎస్‌ఆర్ మనోహర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ ని వాళ్ల పర్శనల్ మేకప్ మెన్స్ కిడ్నాప్ చేస్తారు. అయితే ఎందుకు కిడ్నాప్ చేసారు అనేదే కీలకాంశంగా కథ నడుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్‌ కుమార్, కన్నడ నటుడు రవీంద్రనాథ్, పలువురు జూనియర్ ఆర్టిస్టులపై హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''ఐదుగురు నటీమణుల్ని వాళ్ల దగ్గర పనిచేసే మేకప్‌పర్సన్‌లు అపహరిస్తారు. అసలు ఆ వ్యక్తులు ఎందుకు తారల్ని కిడ్నాప్‌ చేశారు? అన్నది కథలో కీలకాంశం. ఈ నెలాఖరు వరకూ ఫిల్మ్‌సిటీలోనే చిత్రీకరణ చేస్తాం. నవంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు. అలాగే ''ఇది ఐదుగురు సినీతారల కథ. హీరోయిన్ కిడ్నాప్ చుట్టూ కథ నడుస్తుంది. సెప్టెంబర్‌లో షూటింగ్ పూర్తవుతుంది'' అని తెలిపారు.

నిజజీవిత పాత్రను ఇందులో పోషిస్తున్నానని కీర్తి చావ్లా తెలుపగా, ఇప్పటివరకూ చేయని కొత్త తరహా పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నానని కిరణ్‌రాథోడ్ చెప్పారు. ఇందులో హోం, సినిమాటోగ్రఫీ మంత్రిగా నటిస్తున్నానని విజయ్‌కుమార్ చెప్పారు. కిరణ్‌రాథోడ్‌, కీర్తిచావ్లా లతో పాటు మేఘనానాయుడు, శివాని, ఆర్తి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నమిత, నళిని, సత్యప్రకాష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: ఇరముని శేఖర్, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: భూపతి, కెమెరా: జేజి కృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X