For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  షాక్: విక్రమ్ ఏంటి ఇలా అయిపోయాడు?

  By Srikanya
  |
  చెన్నై: జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్.. ఇప్పటికే పలు రకాల గెటప్ లలో కనపించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ఆయన తన తాజా చిత్రం కోసం...పూర్తిగా ఇరవై కేజీల బరువు తగ్గి షాక్ ఇస్తున్నాడు. అయితే అది శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ నా మరొకటా తెలియటం లేదు. కానీ విక్రమ్ ని ఇలా చూసిన వారు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంతలా ఎలా రివటలా తయారయ్యాడని చర్చించుకుంటున్నారు. అయితే విక్రమ్ మాత్రం కొట్టిపారేస్తున్నారు. బరువు తగ్గటమే కష్టం కానీ..పెరగటం ఎంత సేపు అంటున్నాడు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావా..అంటే నిపుణులు పర్యవేక్షణలో చేస్తాం కదా అంటున్నారు.

  ఇక ప్రస్తుతం విక్రమ్.. శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఐ చిత్రం పైనే అందరి దృష్టీ ఉంది. ఈ చిత్రంలో పోనీ టెయిల్ తో విక్రమ్ తన ఫ్యాన్స్ కి పండుగ చేస్తాడంటున్నారు. 'ఐ'లో విక్రమ్ సరసన ఎమీ జాక్సన్‌ ఆడిపాడుతోంది. మలయాళ నటుడు సురేష్‌గోపి, హాస్య నటుడు సంతానం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రెండో షెడ్యూల్‌ను ఇటీవలే చైనాలో పూర్తి చేసుకుని స్వదేశానికి చేరకుంది చిత్ర యూనిట్‌. 'ఐ'లో అదిరిపోయే పోరాట సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారట. ఆస్కార్‌ అవార్డు పొందిన చిత్రానికి స్టంట్స్‌ సమకూర్చిన యాన్‌ వూ పింగ్‌ స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరించారట. ఇంతటి శక్తిమంతమైన పోరాటాలకు తన దేహదారుఢ్యం కూడా అదేస్థాయిలో ఉండాలని భావించిన విక్రమ్‌ సిక్స్‌ప్యాక్‌కు మారాడట. ఈ వేషధారణ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

  మరో ప్రక్క ఈ చిత్రం ఓ చైనీస్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ రూమర్స్ ప్రకారం ఈ చిత్రం Running on Karma (2003)ఆనే చిత్రం ఆధారంగా రూపొందుతోంది. విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. విక్రమ్‌, అమీ జాక్సన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు.

  రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్‌ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

  English summary
  Chiyaan Vikram will have to spend a good amount of time in the gym to have a uber cool avatar in Shankar's next film I. The forthcoming film is a romantic-thriller, which has AR Rahman's music, PC Sriram's cinematography, also features Santhanam, Malayalam actor Suresh Gopi, Ramkumar (Nadigar Thilakam Sivaji Ganesan's eldest son) and others. It is produced by Aascar Ravichandran.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more