రజనీ ‘సుల్తాన్’ మళ్లీ కొత్తగా: సౌందర్య
రజనీకాంత్ హీరోగా 'సుల్తాన్"అనే యానిమేషన్ సినిమా రూపొందిస్తున్నట్లు రజనీ కూతురు సౌందర్య గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన కొన్ని ట్రైలర్స్ ను కూడా అప్పట్లో విడుదల చేశారు. అయితే ఇప్పడు ఆ సినిమా అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది సౌందర్య. ''సుల్తాన్ సినిమా నా కలల ప్రాజెక్టు, అయితే ఆ సినిమా నిర్మించడంలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి, కొన్ని తప్పటడుగులు కూడా వేశాం, ఈ సినిమా మళ్లీ సరికొత్తగా, కొత్త టైటిల్ తో, కొత్త కథాంశంతో త్వరలోనే పున:ప్రారంభిస్తా"" అంటూ పేర్కొంది సౌందర్య.
అభిమానులు ఎప్పటికప్పుడు నా ప్రాజెక్టుల గురించి, నాన్న రజనీకాంత్ గురించి నా ద్వారా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ట్విట్టర్ ద్వారా అభిమానులకు నేను చాలా దగ్గర అవుతున్నాను, ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించే అంశం అంటూ పేర్కొంది.
ఇటీవలే ట్విట్టర్లో చేరిన సౌందర్య కొద్ది రోజుల్లోనే దాదాపు 2 వేల మంది ఫాలోవర్స్ ను ఏర్పరచుకుంది. అంతే కాదు ఎప్పటికప్పడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఇతర సెలబ్రిటీల మాదిరి సౌందర్య కూడా ట్విట్టర్ బానిసగా మారిందనే వాదన వినిపిస్తోంది చెన్నయ్ వర్గాల్లో.


Click it and Unblock the Notifications











