twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెండితెరపై ఎల్టీటీఈ ప్రభాకరన్‌ జీవిత చరిత్ర

    By Srikanya
    |

    V Prabhakaran
    చెన్నై: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చలనచిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఎ.ఎం.ఆర్‌.రమేష్‌ ప్రకటించారు. ఆయన ఇప్పటికే వీరప్పన్‌పై 'వనయుద్ధం' తెరకెక్కిస్తున్నారు. తన నిర్ణయానికి ఎల్టీటీఈ నుంచి ఎలాంటి ఆక్షేపణ ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. వనయుద్ధ చిత్రం ఈ నెల 14న విడుదల కానుందని చెప్పారు.

    ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ జీవిత చరిత్ర తెరపైకి ఎక్కనుంది. వివాదాస్పద ఇతివృత్తాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూసే దర్శకుడు ఏఏఆర్.రమేష్. ఇంతకు ముందు ఈయన కుప్పి, కాదల ర్‌కుడిఇరుప్పు వంటి యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రాలు తీశారు. తాజాగా వీరప్పన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన 'వనయుద్ధం' పెను దుమారాన్ని రేపింది. కోర్టులు, తీర్పులు అంటూ కొన్ని కత్తెరల అనంతరం ఈ చిత్రం 14న తెరపైకి రానుంది. ఈ సంచలన దర్శకుడు తర్వాత ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం వివాదాంశం అవుతుందని ప్రశ్నించగా ఎల్‌టీటీఈ నుంచి తనకు ఎలాంటి సమస్యలూ తలెత్తబోవని ఒకవేళ అలాంటిదేమైనా ఎదురైతే అప్పుడు చూద్దాం అంటూ బదులిచ్చారు.

    ఇక ఈ దర్శకుడు డైరక్ట్ చేసిన వనయుద్ధం చిత్రానికి విముక్తి లభించింది. ఈ చిత్రంపై విధించిన నిషేధాన్ని హైకోర్టు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధం అవుతోంది. కుప్పి, కాదలర్ కుడియిరుప్పు వంటి వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిం చిన దర్శకుడు ఎంఆర్ రమేష్ తాజాగా రూపొం దిస్తున్న చిత్రం వనయుద్ధం. గంధపు స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం లో అర్జున్, కిషోర్, విజయలక్ష్మి, జయచిత్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమైంది. ఈ చిత్రం విడుదలపై గం ధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు వనయుద్ధం చిత్రంపై తాత్కాలిక స్టేను విధించింది. ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ చిత్ర దర్శక నిర్మాత హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇందులో ఆయన తరపు న్యాయవాది ఎ.నటరాజన్ హాజరై వీరప్పన్ గురించి ప్రచారమైన వార్తలను ఇతివృత్తంగా తీసుకుని వనయుద్ధం చిత్రాన్ని తెరకెక్కించామని పేర్కొన్నారు.

    English summary
    AMR Ramesh, whose film Cyanide won critical and mass acclaim, is now set to make his next blockbuster a film on slain LTTE leader V Prabhakaran. "I will definitely make a movie on Prabhakaran. I will visit the Tamil regions in Lanka along with my journalist friends after a couple of months, when the situation eases. The subject calls for extensive research on Prabhakaran's life," he told Hit List.Ramesh claims the LTTE top brass was very impressed with Cyanide. "I was told that Prabhakaran was all praise for my effort," he adds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X