తమిళ స్టార్ సూర్య 'NGK' రిలీజ్ డేట్ ఖరారు
తమిళ స్టార్ సూర్య త్వరలో 'NGK' (నంద గోపాల కృష్ణ)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా ఏప్రిల్ రెండో వారంలోనే తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా వాయిదా వేశారు.
తాజాగా 'NGK' చిత్ర బృందం రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. మే 31న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్కూల్స్ హాలీడే సీజన్ కావడంతో దర్శక నిర్మాతలుఈ తేదీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

"నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను NGK అని పిలుస్తారు" అని సూర్య చెప్పే డైలాగ్‌తో ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. పవర్‍ఫుల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది.
ఈ మూవీలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











