జ్యోతికకు సోదరుడిగా కార్తి... రొమాన్స్ చేసేది ఎవరితోనో తెలుసా?

తమిళ నటుడు కార్తి తొలిసారి తన రియల్ లైఫ్ వదినమ్మ జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇందులో వారిద్దరూ తోబుట్టువులుగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'దృశ్యం' ఫేం జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

కొన్ని వారాల క్రితమే షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రముఖ నటుడు సత్యరాజ్, 'రాక్షసన్‌' ఫేం అమ్ము అభిరామి కీకలపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కేరళ బ్యూటీ నిఖిలా విమల్ కూడా జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కార్తి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మలయాళ చిత్రం 'ఒన్బదు కుళి సంపత్‌' అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిలా విమల్‌ తమిళంలో 'వెట్రివేల్‌' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుచుకుంది. ఇపుడు కార్తి లాంటి పెద్ద స్టార్ సరసన నటించే అవకాశం రావడంతో ఆమె దశ తిరిగినట్లు అని అంటున్నారు.

Nikhila Vimal joined in Jyothika and Karthi untitled film

సూర్యతో పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక... ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. తొలిసారిగా తన మరిది కార్తితో నటిస్తున్న మూవీ ఇది. ఈ మూవీ కథ విషయానికొస్తే తన సోదరుడి కోసం అన్వేషించే పాత్రలో జ్యోతిక కనిపిస్తుందట. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చుస్తున్నారు. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిళ మీడియా వర్గాల ప్రకారం ప్రకారం... జ్యోతిక సోదరుడు సూరజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

కార్తి ప్రస్తుతం భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు ఆయన నటించిన 'ఖైదీ' విడుదలకు సిద్ధంగా ఉంది. జ్యోతిక కూడా మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. కార్తి నటించిన చివరి చిత్రం దేవ్ బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X