వేషం కావాలంటే సెక్స్ తప్పదన్నాడని హీరోయిన్
తాను ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని, తాను నిద్రపోతున్నా ఆ నిర్మాతే కలల్లోకి వచ్చి భయపెడుతున్నాడంటోంది భోజపురి హీరోయిన్ నిషా యాదవ్. నాలుగు రోజుల క్రితం రామ్ నాధ్ అనే తమిళ నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆమె రీసెంట్ గా ముంబై మీడియాతో మాట్లాడింది.తను సైతాన్ అనే హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి ముంబైలో ని ఓ పార్టీకి హాజరైతే అక్కడ పరిచయమయ్యాడంటోంది ఆ నిర్మాత.తాను రమ్య కృష్ణ,ప్రియమణిలతో తమిళంలో ఓ చిత్రం చేస్తున్నానని తనను హీరోయిన్ గా చెయ్యమని అడిగి నెంబర్ తీసుకుని మరుసటి రోజు నుంచి సెక్స్ వల్ గా హెరాస్ చేసాడని ఆరోపిస్తోంది. ఆ తర్వాత తాను ఎంక్వైరీ చేస్తే అస్సలు అతను సినిమాలకు సంభంధం లేదని తేలిందని,తాను షాక్ అయ్యానని చెప్పింది. అంతేగాక తాను ఛోటా రాజన్ గ్రూప్ కి చెందిన వాడిని బెదిరించాడని అదే పదే పదే గుర్తుకు వస్తోందని అంది. ఇక ఈ పరిశ్రమలో ఇలాంటివి కామన్ అని కొందరు అంటున్నా తాను జీర్ణించుకోలేకపోతున్నానని అంది.


Click it and Unblock the Notifications











