'ది ఐరన్ లేడీ'.. అదరగొట్టేసిన నిత్యామీనన్.. జయలలిత బయోపిక్ ఫస్ట్ లుక్!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం మొత్తం పోరాటాలతో కొడుకున్నాడు. నటిగా కెరీర్‌‌ని ఆరంభించి దక్షిణాదిలో తిరుగులేని స్టార్‌గా అవతరించింది. ఆ తరువాత ప్రముఖ నటుడు ఎంజీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు దిద్దింది. ఎంజీఆర్ తరువాత అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఐదు సార్లు తమిళనాడుకు తిరుగులేని ముఖ్యమంత్రిగా కొనసాగారు. జయలలిత 2016 డిసెంబర్ 5న అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె దూరమై నేటికీ సరిగ్గా రెండేళ్లు. జయలలిత జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలని ఎందరో తమిళ దర్శకులు ప్రయత్నిస్తున్నారు. వారందరిలో యువ మహిళా దర్శకురాలు ప్రియదర్శిని ముందడుగేసారు.

జయలలిత వర్ధంతి

ది ఐరన్ లేడీ పేరుతో దర్శకురాలు ప్రియదర్శిని జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నేడు జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ప్రియదర్శిని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తుండడం విశేషం. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో జయలలిత ఎలా ఉన్నారో అచ్చు అలానే నిత్యామీనన్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నది నిత్యా మీనన్ అని తెలియనివాళ్ళు ఫస్ట్ లుక్ లో ఉన్నది జయలలితే అని భ్రమ పడడం ఖాయం.

మురుగదాస్ చేతులమీదుగా

మురుగదాస్ చేతులమీదుగా

ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ప్రియదర్శిని జయలలిత బయోపిక్ ది ఐరన్ లేడి చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్ర టైటిల్ లోగోని ప్రముఖ దర్శకుడు మురుగదాస్ లాంచ్ చేశారు. తమిళనాట జయలలిత బయోపిక్‌కు మంచి డిమాండ్ ఉంది. జయలలిత జీవితం పోరాటాలతో కూడుకున్నది కనుక వెండి తెరపై అద్భుతమైన కథ అవుతుంది. ప్రియదర్శిని దర్శకురాలిగా ఇది డెబ్యూ మూవీ.

త్రిష, నయనతార అంటూ

త్రిష, నయనతార అంటూ

చాలా రోజులుగా జయలలిత బయోపిక్‌లో త్రిష నటించబోతోంది అంటూ ప్రచారం జరిగింది. మరి కొందరు నయనతార నటించబోతోంది అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ఆ అవకాశం ముందుగా నిత్యామీనన్ కే దక్కింది. ఫస్ట్ లుక్‌లో నిత్యామీనన్ జయలలితలాగే కట్టు, బొట్టు, చిరునవ్వుతో కనిపిస్తోంది.

జయలలిత మరణం

జయలలిత మరణం

జయలలిత జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి. అనేక అనుమానులు ఎదుర్కొన్నారు. ప్రతిసారి గోడకు కొట్టిన బంతిలా దూసుకొస్తూ పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజలచేత అమ్మా అని పిలిపించుకునేంత అభిమానం సొతం చేసుకున్నారు. జయలలితపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు జయలలిత మరణంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ది ఐరన్ లేడీ చిత్రంలో దర్శకురాలు ప్రియదర్శిని ఎలాంటి అంశాలు చూపిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X