అందులో ఎవర్నీ వేలు పెట్టనివ్వను: నిత్య మీనన్

By Srikanya

'అలా మొదలైంది' చిత్రంతో పరిచయమైన నిత్యా మీనన్ ప్రతీ విషయంలోనూ తనకంటూ స్వంత అభిప్రాయాలు ఉన్నాయంటోంది.ఆమెను మీ సినిమాలు ఓకే చేసే ముందు ఎవరి సలహా తీసుకుంటారు అంటే..కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా సలహాలు ఇస్తుంటారు. వాటిని వినడం వరకే నా పని. నిర్ణయం మాత్రం నాదే. నా జీవితం గురించి ఇంకెవరో నిర్ణయం తీసుకోవడం నచ్చదు. అలాచేస్తే స్వేచ్ఛగా ఉండలేను. మనసుకు ఎంతో నచ్చితే కానీ ఏ సినిమా ఒప్పుకోను. అందుచేత పాత్రల ఎంపికలో ఎవర్నీ వేలు కూడా పెట్టనివ్వను. సినిమా జయాపజయాల గురించీ పట్టించుకోను అంది. అలాగే పాత్రల ఎంపికలోనూ, వ్యక్తిగత విషయాల్లోనూ ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం నాదే అంటోంది అలాగే స్వతహాగా మనసులో ఏదీ దాచుకోని మనస్తత్వం నాది.

లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా మాట్లాడటం నాకు చేతకాదు. వాస్తవంగా ఇలాంటి మనస్తత్వం ఉండటం మంచిదే.కానీ బయట మాత్రం ఎన్నో చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇటీవల ఓ విషయంలో నాకిలానే జరిగింది. ననన్న మాటకి పెడార్దాలు తీసారు అంది. ఈ మాట విన్న వారందరకీ సిద్దార్ధతో ఆమె చేసిన 180 చిత్రం ప్రమోషన్ లో ప్రభాస్ గురించి చేసిన కామెంట్ గుర్తుకు వచ్చింది. అలాగే సీనియర్ హీరోలతో చేయనని చెప్పటం కూడా గుర్తు చేసుకున్నారు. ఇక ఆమె చేసిన సెగ, 180 చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో తెలుగులో ఆమెకు పెద్ద సినిమాలేం లేవు. తెలుగులో అయితే అస్సలు ఆఫర్సే రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X