Sai Pallavi Vs Nithya Menon: సాయిపల్లవికే అవార్డు.. నిత్యా మీనన్ దిమ్మతిరిగే కౌంటర్!
జాతీయ ఉత్తమ నటి అవార్డు వ్యవహారం టాప్ హీరోయిన్లు నిత్య మీనన్, సాయి పల్లవి మధ్య చిచ్చు పెట్టింది. జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటి కేటగిరిలో ఈ ఇద్దరు యాక్టర్లు పోటీ పడ్డారు. అయితే చివరకు ఈ అవార్డుకు నిత్యా మీనన్‌ను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. అయితే ఇటీవల ఆమె జాతీయ అవార్డు అందుకొన్న సమయంలో సాయి పల్లవి అభిమానులు చేసిన విమర్శలు, ట్రోలింగ్‌పై నిత్యా మీనన్ ఘాటుగా స్పందించారు. తాజా ఇంటర్యూకు సంబంధించిన ఆమె వీడియో వైరల్ అవుతున్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
తమిళ సినీ రంగం నుంచి నేషనల్ అవార్డు కోసం తిరుచిత్రంబాళం అనే చిత్రంలో తన పాత్ర కోసం నిత్య మీనన్, అలాగే గార్గి సినిమాలోని తన రోల్ కోసం సాయి పల్లవి దరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఈ రెండు ఎంట్రీలతోపాటు మరికొన్న సినిమాలను పరిశీలించిన తర్వాత నిత్య మీనన్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించారు.

అయితే నిత్యా మీనన్‌కు అవార్డు రావడంపై సాయి పల్లవి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. నిత్య కంటే సాయి పల్లవికి అవార్డు రావాల్సింది. గార్గి సినిమాకు అవార్డు గెలుచుకొనే సత్తా ఉంది. కానీ నిత్యకు రావడం ఆశ్చర్యంగా ఉంది అని కామెంట్స్ చేశారు. జ్యూరీ సభ్యులు కావాలనే, ఉద్దేశపూర్వకంగా సాయి పల్లవికి అవార్డు రాకుండా నిర్ణయం తీసుకొన్నారు అని విమర్శలు చేశారు.
తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై తాజా ఇంటర్వ్యూలో నిత్యమీనన్ మాట్లాడుతూ.. ఎవరేమనుకొన్నా నాకు పర్వాలేదు. నా వర్క్ నేను చేసుకొంటూ పోతాను. కొంతమంది అనవసరంగా మాట్లాడుతున్నారు. లైఫ్‌లో ఏదో ఒక్కసారి వచ్చే అవార్డు కాదు. ప్రతీ ఏడాది ఈ అవార్డులను ఇస్తారు. నాకు ఈ ఏడాది అవార్డు వచ్చినందుకు వారు ఎందుకు ఇంత రాద్దాంత చేస్తున్నారో అర్దం కాదు అని నిత్య మీనన్ అన్నారు.

జాతీయ అవార్డు అందుకొన్న తర్వాత జ్యూరీ సభ్యులు నన్ను కలిశారు. నాతో వారు మాట్లాడుతూ నా వర్క్ గురించి ప్రశంసలు అందించారు. చాలా ఏళ్లుగా మీరు చేసే సినిమాలు చూస్తున్నాం. మిమ్మల్ని, మీ సినిమాలను ఫాలో అవుతున్నారని చెప్పడం సంతోషంగా అనిపించింది. కానీ కొంత మంది ఏదో అనాలని ప్రయత్నిస్తారు. ఆ ట్రోల్స్, విమర్శలను నేను పట్టించుకోను అని తెలిపారు.
నాపై ఎవరేమన్నా వారిని సీరియస్‌గా తీసుకొను. ఇతరుల గురించి మాట్లాడే వారిని. ఇతరు తప్పా? రైటా అంటూ చర్చలు జరిపే వారిని నేను ఎందుకు పట్టించుకోవాలి. కేవలం నేను ఏం చేస్తున్నాను. నా వర్క్ ఏమిటి? అనేది చూసుకొంటాను అని నీత్య మీనన్ స్పష్టం చేశారు. ఆమె ప్రస్తుతం జయం రవితో కలిసి కాదలిక్క నెరమిల్లై సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. శివ కార్తీకేయన్‌తో కలిసి అమరన్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా దీపావళీకి రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











