నిత్యా మీనన్ ఇండస్ట్రీలో బాగా ముదరింది
తెలుగులో 'అలా మొదలైంది' చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ కి ఇండస్ట్రీ నీళ్లు బాగా వంటబట్టి ముదిరింది అంటున్నారు. రీసెంట్ గా ఆమె '180' సినిమా ప్రమోషన్‌కి బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ నిత్యామీనన్ మాట్లాడుతూ "నేను బెంగళూరు అమ్మాయినే...నేను ఇందిరానగర్‌లో ఉండేదాన్ని. నాలుగేళ్ళ క్రితమే నాకు కన్నడ మూవీతో బ్రేక్ వచ్చింది. రెండేళ్ల క్రితం వచ్చిన 'జోష్' సినిమా కన్నడంలో బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు కన్నడంలో 'జోగయ్య' సినిమా చేస్తున్నాను..పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా అంది. అది విన్న వారికి కాజల్ ముంబైలో అన్న మాటలు గుర్తు వచ్చాయి. ఆమె హిందీ సినిమా 'సింగం' ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ముంబైకి వెళ్లినప్పుడు కాజల్ అగర్వాల్...'నేను సౌతిండియా హీరోయిన్ కాను. నేను ఉత్తరాదికి చెందిన అమ్మాయినే' అంది.


Click it and Unblock the Notifications











