బ్యాన్ పై స్పందించిన నిత్యా మీనన్

By Srikanya

తనపై మళయాళ చిత్ర పరిశ్రమ పెట్టిన బ్యాన్ ముగిసిందని నిత్యా మీనన్‌ తెలిపింది. బుధవారంనాడు ఆమె మీడియా మాట్లాడింది. కేరళకు చెందిన మారుతీ చిట్‌ఫండ్‌ నూతన శాఖ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌ వచ్చిన ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అదొక దురదృష్ట ఘటన అనీ, కొన్ని అపార్థాల వల్ల భేదాలు వచ్చాయంది. ఐతే తన చొరవతో అవన్నీ ఇప్పుడు తీరిపోయాయిని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ నిత్య ఎలాంటి చొరవ చూపి అపార్థాలను తొలగించుకున్నదో అని చర్చించుకుంటున్నారు. ఇక ఆమెపై బ్యాన్ పెట్టిన కారణాల్లోకి వెళితే...షూటింగ్‌లో ఉన్న తనను కలవడానికి వచ్చిన కొంతమంది నిర్మాతలను పట్టించుకోలేదు. అంతేగాక వాళ్ళతో మళ్ళీ కలుస్తానని చెప్పి కలవలేదు. దాంతో వాళ్లకు కోపం వచ్చి మలయాళ నిర్మాతల మండలికి నిత్యాపై ఫిర్యాదు చేశారు. ఆమెను మలయాళచిత్రాల్లో అవకాశాలు ఇవ్వకుండా చూడాలని కోరారని తెలుస్తోంది.

నిర్మాతలమనే మినిమం గౌరవం లేకుండా బిహేవ్ చేస్తోందని,చాలా అగౌవర పరిచిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమెను బ్యాన్ చేయాలని వారు పట్టుపడుతున్నారు. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. తన కుమార్తెపై నిర్మాతలు చేసిన ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందనీ, నిత్యామీనన్ మలయాళ నిర్మాతల మండలితో చర్చిస్తోందని నిత్యామీనన్ తల్లి మీడియాకు తెలిపింది. ఇక అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఓవర్ నైట్ లోనే కుర్రకారు కలల హీరోయిన్ అయ్యిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సెగ,180 చిత్రాలు విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ సరసన ఇష్క్ అనే చిత్రం చేస్తోంది.అలాగే బాణం హీరో నారా రోహిత్ సరసన ఆమె బుక్కైంది. కథ చిత్రంతో పరిచయమైన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X