నాకు తొలి ఆఫర్ ఎలా వచ్చిందంటే...'అలా మొదలైంది' నిత్యా మీనన్
'అలా మొదలైంది'తో తెలుగు తెరకి పరిచయమైన నిత్యా మీనన్ కి తొలి అవకాశం ఎలా వచ్చిందో ఈ మధ్యన మీడియాతో చెప్పుకుంది.ఆమె మాటల్లో..ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఓ టూరిజం బుక్ కవర్‌పై నా ఫొటో వచ్చింది. అది చూసి హీరో మోహన్ లాల్ డైరెక్టర్ కె.పి. కుమరన్‌కి చెబితే, ఆయన నన్ను 'ఆకాశ గోపురం' కోసం అడిగారు. దాంతో ఊహించనివిధంగా నటినయ్యా అంది. అలాగే తాను ఆర్టిస్టు కావడానికి ఆమె అమ్మమ్మ ససేమిరాఒప్పుకోలేదని చెప్పింది. ఆమె ఎప్పుడూ నన్ను పెళ్లి చేసుకొమ్మని పోరుతూ ఉంటుంది. కానీ మా అమ్మానాన్నలు నా విషయంలో చాలా హ్యాపీ. అందుకే వాళ్లు బాధపడేలా ఎన్నడూ ప్రవర్తించను. వాళ్లు చూడ్డానికి ఇబ్బందిపడే పాత్రలు చెయ్యను'' అని చెప్పింది. త్వరలో సిద్ధార్థ సరసన '180'లోనూ, తెలుగులో తన తొలి హీరో అయిన నాని సరసన మరోసారి 'సెగ'లోనూ ఆమె కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications











