రంజిత, నిత్యానందలకు ట్విస్ట్.... రాసలీలలు వెండి తెరపై
చెన్నై: నిత్యానంద రాసలీలలపై సినిమా వారికి రోజు రోజుకీ మోజు పెరిగిపోతోంది. తాజాగా చెన్నై కి చెందిన ఓ నిర్మాత దృష్టి ఈ హాట్ రొమాన్స్ పై పడింది.. ముత్తుకుమార్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అచ్చం రంజిత,నిత్యానంద ఎపిసోడ్ ని ఉన్నదున్నట్లుగా (బయిటకు వచ్చిన వీడియో టేప్ లో స్టిల్ ని అనుసరిస్తూ) షూట్ చేసారు. గెటప్స్ తో సహా అలాగే చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ 'Vennilaavin Arangetram'.
ఈ చిత్రం గురించి ముత్తు కుమార్ మాట్లాడుతూ... ఓ సెక్స్ వర్కర్ తన తో బెడ్ షేర్ చేసుకున్న సెలబ్రేటీల అనుభవాలుని నేరేట్ చెయ్యటమే ఈ సినిమా కథ అన్నాడు. ఆ నేపధ్యంలో ఓ స్వామిజీని కలుస్తుందని,అప్పుడు ఆశ్రమంలో ఈ ఎపిసోడ్ వస్తుందని చెప్పాడు. ఈ చిత్రంలో కొడం బాకం కి చెందిన ట్రాన్సెంజర్ మూర్తి.. స్వామి గా కనపడుతూండగా, కొత్త అమ్మాయి రంజితగా కనిపిస్తుంది. అలాగే సీనియర్ సీత, సెక్స్ బాంబ్ షకీలా కీ రోల్స్ లో కనిపిస్తారు.
ఇక నిత్యానందకు రోజుకో సినిమా మొదలై ఆయనకు కొత్త తలనొప్పిని పెడుతూ వస్తోంది. ఆ మధ్యన కన్నడంలో మదన్ పటేల్ అనే దర్శక, నిర్మాత సత్యానంద అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...తమ చిత్రంలో నిత్యానంద నిజ జీవితంలో సంఘటనల, రజితతో రాసలీలలు అన్నీ ఉంటాయని ప్రజలకు నిజం తెలియాలనే ఆలోచనలతోనే ఈ చిత్రం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటు పలు భాషల్లోకి అనువదించనున్నట్లు తెలిపారు. అంతేగాక నిత్యానంద స్వామి పోలికలు ఉన్న ఒక యువకుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. నటి రంజిత తాను నిత్యానందతో రాసలీలలు సాగించలేదని చెప్పడాన్ని మదన్ పటేల్ ఖండించారు. అదే నిజమైతే సత్యానంద చిత్రంలో నటించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు.


Click it and Unblock the Notifications












