శృంగారతారతో నిత్యానంద స్వామి.. లీగల్ నోటీసులతో సరికొత్త కాంట్రవర్సీ!
Recommended Video
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటిస్తున్న పప్పీ సినిమా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు కనిపిస్తున్నది. ఆగస్టు 16న రిలీజ్ చేసిన టీజర్‌లో స్వామి నిత్యానందను కించపరిచే విధంగా చూపించారనే ఆరోపణలపై కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమా చట్టపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తనను తప్పడు రితీలో చూపించడంతో నిర్మాతపై నిత్యానంద స్వామి వర్గం కేసు నమోదు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

వివాదంగా నిత్యానందస్వామి ఫోటో
యోగిబాబు హీరోగా నటించే పప్పీ సినిమా టీజర్‌లో అమెరికన్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ పక్కనే నిత్యానంద స్వామిని పోలిన ఫోటోను పెట్టడం వివాదంగా మారింది. పోర్న్ స్టార్ పక్కనే స్వామి ఫోటోను పెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం.

నిత్యానంద స్వామి ప్రతిష్టకు భంగం
నిత్యానంద స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివసేన స్పందించింది. నిత్యానంద ఫొటోను తొలగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని తమిళనాడు శివసేన డిప్యూటీ చీఫ్ ఏ సెల్వం పిటిషన్ దాఖలు చేశారు. నిత్యానంద స్వామి భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

నిత్యానంద స్వామి లీగల్ నోటీసులు
ఇదిలా ఉండగా, పప్పీ టీజర్‌లో తనను పోలిన ఫొటోను పెట్టడంపై స్వయంగా నిత్యానంద స్వామి కూడా స్పందించాడు. స్వయంగా చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న టీజర్ నుంచి తన ఫొటోను తొలగించాలని, లేకపోతే వెంటనే చర్యలు తీసుకొంటానని నిత్యానంద లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

పప్పీ టీజర్‌కు విశేష స్పందన
యోగిబాబు హీరోగా రూపొందుతున్న పప్పీ చిత్రానికి మొరాట్టు సింగిల్ దర్శకుడు. ఈ చిత్రం వరు, సంయుక్త హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోమలి లాంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభిస్తున్నది.
వివాదాస్పద టీజర్ లింక్ కోసం..
నిత్యానంద స్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పప్పీ మూవీ టీజర్ ఇదే..


Click it and Unblock the Notifications











