జూ ఎన్టీఆర్ శక్తిలా సూపర్ స్టార్ సినిమాకి నో బడ్జెట్ లిమిట్...
కాస్ట్ కటింగ్..అంటూ టాలీవుడ్ లో బడ్జెట్ ని తగ్గించేందుకు నానా తంటాలూ పడ్తోంటే, తమిళనాట రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న 'రాణా"సినిమాకి మాత్రం, బడ్జెట్ ఎంతనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్నాడు దర్శకుడు కెఎస్ రవికుమార్. రజనీ కుమార్తె సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బడ్జెట్ ని నూట యాభై కోట్లకు పైగానే లెక్కలేశారట. పీరియాడికల్ కథాంశం కావడంతో, సెట్స్ కోసం బాగనే ఖర్చు చేయాల్సి వుంటుందనీ, అంచనాలను మించే వ్యయం సినిమాకి అవుతుందనీ, సినిమా విడుదలయ్యాక పెట్టిన సొమ్ముకు మూడింతల లాభం ఖాయమని కెఎస్ రవికుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
దీపికా పదుకొనే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తుండగా, రజనీకాంత్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కన్సించనుండడం విశేషం. మిగతా రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్లతోపాటు, మరో ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషిస్తారట. 'రోబో" సక్సెస్ తో రజనీ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యిందనీ, 'రాణా" సినిమాతో రజనీ మరింతగా ఇండియన్ సినిమా రేంజ్ ని పెంచేస్తాడని తమిళ సినీ వర్గాలంటున్నాయి.


Click it and Unblock the Notifications











