అందులో వాస్తవం లేదటంటున్న గోవా బ్యూటి
'త్రీ ఇడియట్స్" చిత్రానికి రీమేక్ గా తమిళంలో శంకర్ దర్శకత్వంలో 'నన్బన్" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గోవా భామ ఇలియానా కథానాయికగా నటిస్తోంది. సరైన సక్సెస్ లు లేక ఇటీవల కొంత నిరుత్సాహంతో వున్న ఈ వయ్యారి ఈ చిత్రంపై ఎన్నో ఆశల్ని పెట్టుకుంది. అందుకే చ్నైలోనే మకాం వేసి ఈ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టిపెడుతోందట. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ నృత దర్శకత్వంలో సినిమాకి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ చైన్నైలో జరుగుతోంది. అయితే ఒక క్లిష్టమైన నృత్యభంగిమ చేస్తున్న సమయంలో ఇలియానా తీవ్రంగా గాయపడిందని, దాంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడనుందని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలో వాస్తవం లేదని ఇలియానా ప్రకటించింది. డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న సమయంలో కాలు బెణకడంతో వెంటనే డాక్టర్ ను సంప్రదించానని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వారు సలహా ఇచ్చారని తెలిపింది. అంతేకాదు తన గాయం వల్ల చిత్రీకరణ వాయిదా పడ్డ విషయంలో వాస్తవంలేదని పేర్కొంది. ఈ చిత్రంతో పాటు ఈ భామ తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చిత్రంతో పాటు పూరి దర్శకత్వంలో రవితేజ సరసన 'ఇడియట్ 2"లో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











