»   » రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...

రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష వ్యవహారం, వివరణ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పలువురు సినీ స్టార్స్ సినిమా రంగం నుండి రాజకీయ రంగం వైపు అడుగులు వేయడం సర్వ సాధారణమే. తెలుగు, తమిళం, హిందీలో ఇలా అన్ని భాషల్లో పలువురు స్టార్స్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ త్రిష కూడా చేరబోతున్నట్లు గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకెలో చేరేందుకు త్రిష ఆసక్తి చూపుతున్నట్లు, త్వరలోనే ఆమె అధికారికంగా ఈ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. 2016లో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోందని, ఎన్నికల్లో పోటీ చేయబోతోందనే ప్రచారం జోరందుకుంది.

NO I am not joining politics: Trisha

దక్షిణాదిలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ వెలుగొందిన త్రిష గత పదేళ్ల కాలంలో అందరు అగ్ర హీరోల సరసన నటించింది. సుధీర్ఘ కాలం సినిమా రంగంలో కొనసాగుతూ....ఇప్పటికీ హీరోయిన్ ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. తనకు స్టార్ ఇమేజ్ ఉన్నపుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే భవిష్యత్ బావుంటుందని త్రిష భావిస్తోందంటూ ప్రముఖ మీడియా సంస్థల్లోనూ వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో త్రిష తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. నేను రాజకీయాల్లోకి రావడం లేదని, ఇపుడే కాదు, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదు అంటూ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.

English summary
"Contrary to recent reports...NO I am not joining politics.Not now n not in the near future...I rest my case" Trisha tweeted.
Please Wait while comments are loading...