twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెజెండ్‌ను కాదు, నా పేరుపై అవార్డులొద్దు: రజనీకాంత్

    By Bojja Kumar
    |

    నా పేరుపై ఎలాంటి అవార్డులు వద్దు, నేను లెజండ్ కాదు...అని తేల్చి చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. ''నా గురువైన బాలచందర్ గారిని రజనీకాంత్ లెజండరీ అవార్డుతో సత్కరిండంపై నేను అసౌకర్యంగా ఫీలయ్యాను, ఇకపై ఈ అవార్డును కె.బాలచందర్ గారి పేరుపై అందజేయాలని'' అని రజనీ సూచించారు. తన భార్య లత నిర్వహిస్తున్న ఆశ్రమ్ ఆర్ట్స్ అకాడమీ 21వ వార్షిక సెలబ్రేషన్స్ లో రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

    శిష్యుడు రజనీకాంత్ గురించి బాలచందర్ మాట్లాడుతూ...రజనీకాంత్ లాంటి క్రమ శిక్షణ గల వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదని వ్యాఖ్యానించారు. అతని లాంటి శిష్యుడు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. కర్నాటక ఆర్టీసీ బస్సు డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్‌కు సినిమా లైఫ్ ఇచ్చింది బాలచందర్ అన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఈ స్థాయికి చేరడానికి మూలకారణం అతనే. ఎప్పుడూ నిరాడంబరంగా జీవించే రజనీకాంత్....తాజాగా మరోసారి తన సంస్కారాన్ని ప్రదర్శించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో కొచ్చాడయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సౌందర్య ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకురాలుగా పరిచయం అవుతోంది. కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

    English summary
    “I am not a legend at all! I felt uncomfortable when my guru K. Balachandar sir was honoured with Rajinikanth Legendary Award. I told even my wife Latha about it. Henceforth from next year, the award should be bestowed in the name of K.Balachandar sir”, remarked Superstar Rajinikanth at the 21st Annual Day celebration of the Ashram Arts Academy, owned by the actor’s wife Latha Rajinikanth in Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X