Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లెజెండ్‌ను కాదు, నా పేరుపై అవార్డులొద్దు: రజనీకాంత్
నా పేరుపై ఎలాంటి అవార్డులు వద్దు, నేను లెజండ్ కాదు...అని తేల్చి చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. ''నా గురువైన బాలచందర్ గారిని రజనీకాంత్ లెజండరీ అవార్డుతో సత్కరిండంపై నేను అసౌకర్యంగా ఫీలయ్యాను, ఇకపై ఈ అవార్డును కె.బాలచందర్ గారి పేరుపై అందజేయాలని'' అని రజనీ సూచించారు. తన భార్య లత నిర్వహిస్తున్న ఆశ్రమ్ ఆర్ట్స్ అకాడమీ 21వ వార్షిక సెలబ్రేషన్స్ లో రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
శిష్యుడు రజనీకాంత్ గురించి బాలచందర్ మాట్లాడుతూ...రజనీకాంత్ లాంటి క్రమ శిక్షణ గల వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదని వ్యాఖ్యానించారు. అతని లాంటి శిష్యుడు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. కర్నాటక ఆర్టీసీ బస్సు డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్‌కు సినిమా లైఫ్ ఇచ్చింది బాలచందర్ అన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఈ స్థాయికి చేరడానికి మూలకారణం అతనే. ఎప్పుడూ నిరాడంబరంగా జీవించే రజనీకాంత్....తాజాగా మరోసారి తన సంస్కారాన్ని ప్రదర్శించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో కొచ్చాడయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సౌందర్య ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకురాలుగా పరిచయం అవుతోంది. కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.