కొమరం పులి నా చివరి సినిమా
కొమరం పులి నేను డైరక్ట్ చేసే చివరి సినిమా అంటున్నాడు దర్శకడు ఎస్.జె.సూర్య. అదేమిటి అలాంటి నిర్ణయం తీసుకున్నారు అని మీడియా ప్రతినిధులు అడిగితే దానికి సమాధానం చెబుతూ..ఇక నుంచి నేను..నటనకే పరిమితం అవదామని నిర్ణయం తీసుకున్నాను అన్నారు. తను తమిళం లో నటించిన వ్యాపారి తెలుగు వెర్షన్ రిలీజ్ సందర్భం గా ప్రమోషన్ లో భాగం గా మీడియా తో మాట్లాడారు. ఇక తమిళంలో అజిత్ కి వాలితో హిట్టిచ్చాను, విజయ్ కి ఖుషితో హిట్టిచ్చాను. ఆ తర్వాత వీరిద్దరూ పరిశ్రమను శాసించే యాక్షన్ హీరోలయ్యారు. నేను మాత్రం నా న్యూ(తెలుగులో నాని)చిత్రంతో మిగిలిపోయాను. ఆ సినిమా హిట్టయ్యాక తర్వాత చేసిన సినిమాలేవి ఆడలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు. అలాగే పులి తమిళ్ వెర్షన్ లో నేనే హీరోగా చేస్తున్నాను..అది హిట్ అయ్యాక డైరెక్టర్ గా కొనసాగను.
క్లోనింగ్ ద్వారా జంతువులను సృష్టించడం మనకు తెలుసనీ, అయితే ఈ చిత్రంలో క్లోనింగ్ ద్వారా మనిషిని సృష్టిస్తే అతను ఎలాంటి అద్భుతాలు చేశాడనే అంశాన్ని దర్శకుడు శక్తి చిదంబరం ఆసక్తికరంగా తెరకెక్కించారనీ సూర్య చెప్పారు. తమన్నా నటనతో పాటు గ్లామరస్ గా కూడా కొత్తగా కనిపిస్తుందనీ, నమిత, మాళవిక అందాలు కుర్రకారుని హుషారెక్కిస్తాయనీ ఆయన పేర్కొన్నారు. అలాగే మంచి స్క్రిప్టుతో వస్తే ఎవరితోనైనా పనిచేస్తా. అయినా స్క్రిప్టు, ప్రెజెంటేషన్ గొప్పగా ఉంటే స్టార్స్ పుడతారు. ఆ తర్వాత కొన్ని హిట్లు వస్తే సూపర్ స్టార్స్ అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పులి చిత్రమే నా చివర వేరే హీరోని డైరక్ట్ చేసే సినిమా. అయినా నేను పరిశ్రమకు వచ్చింది ఓ నెంబర్ వన్ స్టార్ అవుదామని..అది పొగరు అనుకోండి..అయినా బాదపడను...అంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











