సీతగా నయనతార వద్దంటూ ఆందోళన..దిష్టి బొమ్మ దగ్ధం
బాపూ దర్సకత్వంలో రూపొందనున్న "శ్రీరామ రాజ్యం" చిత్రంలో సీత పాత్రకు ప్రముఖ నటి నయనతారను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన తమిళనాడులోని తిరుప్పూర్ లో ఆందోళన చేపట్టింది. రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆందోళనలో సేవ కార్యకర్తలు ఆమె దిష్టిబొమ్మను దగ్గధం చేశారు. రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో సోమవారం ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు చేస్తున్నారని, ఇదొక మల్టీస్టారర్ అని బాలకృష్ణ తెలిపారు. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహిస్తున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల, ఆర్ట్: రవీందర్, సినిమాటోగ్రఫీ: పి.ఆర్కే. రాజు, సంగీతం: ఇళయరాజా, దర్శకుడు: బాపు
More from Filmibeat
నయనతార బాలకృష్ణ బాపు ముళ్ళపూడి వెంకటరమణ సీతారామ కళ్యాణం nayantara balakrishna bapu mullapudi venkata ramana seetarama kalyanam


Click it and Unblock the Notifications











