నొ పొలిటిక్స్ ప్లీజ్ ..స్టార్ హీరో వేడుకోలు!!

మీడియా చర్చా వేదికలు సైతం నిర్వహించి,ఎస్.ఎమ్.ఎస్ కాంటెస్ట్ లు పెట్టే పనిలో బిజీ అయిపోయింది. అయితే రజనీకాంత్ ఎక్కడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోవటం,అసలు ఈ ఊసే ఎత్తక పోవటంతో అందరికీ ఏమీ అర్దం కాలేదు. అయితే మరెందుకు అభిమానులందరని ఒకే సారి కలసి సభ పెట్టాలనుకోవటం అనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో మా చెన్నై ప్రతినిధి రజనీ అభిమాన సంఘాల ప్రెసెడెంట్ సత్యనారాయణ ని సంప్రదించగా ఆయన వివరణ ఇచ్చారు.
అసలు చాలా క్యాజువల్ గా రజనీ తనను ఇన్నాళ్ళుగా అభిమానిస్తున్న వారిని కలవాలనుకున్నారని,దానికోసమే అభిమానసంఘాల సమ్మేళనం ఏర్పాటు చేద్దామనే నిర్ణయానికి వచ్చారని తెలియపరిచారు. అంతేగాక ఆ వార్త బయిటకు వచ్చి...రజనీ పొలిటిక్స్ లోకి వస్తారనే రూమర్ తెచ్చిందని అందుకే ఇప్పుడు తమ మీటింగ్ లో 'నొ పొలిటిక్స్ ప్లీజ్' అనేదే నినాదంగా అమలు చేస్తున్నామని తేల్చేసారు.


Click it and Unblock the Notifications











