హీరో, నేనూ బ్యాచులర్స్ మి...అందుకే తమన్నా
తమన్నాకీ, హీరో కార్తీకీ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ తమిళ మీడియాలో వార్తలు రావటాన్ని తమన్నా ఖండిస్తోంది. ఆమె లేటెస్ట్ గా పయ్యా( తెలుగులో ఆవారా) ప్రమేషన్ మీట్ లో మీడియాని కలిస్తే ఈ టాపిక్ వచ్చింది. ఆమె దీనిపై స్పందిస్తూ...మీరు అనుకున్నట్లు మా మధ్య ఏమీ లేదు...ఆ వార్తల్లో కొంచెం కూడా నిజం లేదు...ఇద్దరూ ఫ్రొపిషనల్ గా కలిసాం. కలిసి కమిటెడ్ గా పనిచేసాం. అయితే లీనమై మేమిద్దరం పనిచేయటమే ఈ రూమర్స్ కి తావిచ్చినట్లయింది. అలాగే కార్తీ, నేను ఇద్దరం ఎలిజిబుల్ బ్యాచులర్స్ కావటం కూడా ఓ కారణం. అంతేగాక మేమిద్దరం మరో సినిమాలో బుక్కయాం అని తెలిసి కూడా ఇలాంటి రూమర్స్ పుట్టి ఉంటాయని అనుకుంటున్నాను. ఇవన్నీ ప్రక్కన పెడితే తెరపై మా కెమిస్ట్రీ అద్బుతంగా పండింది. డైరక్టర్ లింగు సామి సార్ చాలా బాగా చెప్పి చేయించుకున్నారు అని తేల్చేసింది.
తమన్నా హ్యాపీడేస్ లింగు స్వామి కార్తీ పరుత్తి వీరన్ సూర్య యుగానికి ఒక్కడు tamanna happy days lingu swamy karthi parthui veeran surya yuganiki okkadu


Click it and Unblock the Notifications