Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
యంగ్ హీరోతో సీక్రెట్ ఎఫైర్ పై తాప్సీ
తెలుగు,తమిళ భాషల్లో తన గ్లామర్ తో వరస ఆఫర్స్ పట్టుకుంటూ దూసుకుపోతున్న భామ తాప్సీ. ఇప్పుడు ఆమె తమిళంలో మహత్ అనే యంగ్ హీరోతో కలిసి తిరుగుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.వీరి గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాప్సీ షూటింగ్కు వెళ్లినా, పార్టీలకు హాజరైనా మహత్ పక్కనే ఉంటున్నారని, ఇద్దరు ప్రేమలో మునిగిపోయారని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇలాంటి వార్తలపై తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తాప్సీ ఖండిస్తూ మీడియా తో మాట్లాడుతూ... మహత్తో తన స్నేహాన్ని భూతద్దంలో చూస్తున్నారెందుకని నటి తాప్సీ ప్రశ్నిస్తోంది. మహత్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, అయినా రూమర్స్ ప్రవాహం ఆగడం లేదని అంటోంది. మహత్, తాను రహస్యంగా ఏమీ కలుసుకోవడం లేదన్నారు. షూటింగ్ సెట్లో దర్శకుడు, హీరో, ఇలా యూనిట్ సభ్యులందరికీ తమ స్నేహం గురించి తెలుసన్నారు. మహత్కు సినిమా పరిశ్రమతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. నటుడు శింబుకు మహత్ బాల్యమిత్రుడని, అలాగే నిర్మాత దయానిధి అళగిరికి సన్నిహితుడని తెలిపారు. అలాంటి వ్యక్తిని తాను సిఫార్సు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన తనకు సిఫార్సు చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. తన చిత్రాల వ్యవహారాలను తన తల్లిదండ్రులకు కూడా చెప్పనన్నారు. అలాంటిది మహత్ సిఫార్సులను తానెందుకు ఒప్పుకుంటానని ప్రశ్నించారు. తాను కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నానని, కెరీర్ పరంగా తాము ఇంకా ప్రారంభదశలోనే ఉన్నామని చెప్పారు. ఇలాంటి దుష్ర్పచారం వల్ల తమ కెరీర్ ఎఫెక్ట్ అవుతుందని తాప్సీ అంటోంది. ప్రస్తుతం తాప్సీ తెలుగులో గోపీచంద్ సరసన మొగడు చిత్రం చేస్తోంది.కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.అలాగే ఆమె తమిళంలో చేసిన ఓ చిత్రం వచ్చాడు..గెలిచాడు గా డబ్బింగై మొన్న శుక్రవారం విడుదలై ఫెయిలైంది.