అన్నం మానేసి విక్రమ్ కేవలం...
చెన్నై : ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. 'ఐ' కోసం నటుడు విక్రం సకలవిధాలా తనను తాను మలుచుకుంటున్నారు. కథకు తగ్గట్లు తన శరీరాకృతిని మార్చుకుంటున్నారట. మూడు భిన్న కోణాల్లో విక్రం కనిపించనున్నట్లు సమాచారం.
ఇందులో రెండు పాత్రల్లో విక్రం చాలా సన్నగా కనిపించాలని దర్శకుడు చెప్పారట. ఇప్పటికే ఓ పాత్రకు సంబంధించిన ఫొటోలు వచ్చాయి. అందులో విక్రం నేటితర యువకుడిలా బక్కపలచగా కనిపిస్తున్నారు. మరో పాత్ర కోసం ఇంకాస్త సన్నబడినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కోసం నటుడు విక్రమ్ వూహించని స్థాయిలో సన్నబడ్డాడు. పదహారేళ్ల యువకుడిలా.. నేటిశైలికి తగ్గట్టు శరీరాకృతిని మలచుకున్నాడు. తాజాగా విడుదలైన ఆయన ఫొటో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రథమార్థంలో సాధారణంగా కనిపించాడట. ద్వితీయార్థంలోని పాత్ర కోసం విక్రమ్ ఇలా మారాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం విక్రమ్ చాలా శ్రమించాడట. '84 కిలోల బరువుండే నేను ఈ పాత్ర కోసం 14 కిలోలు తగ్గానని' విక్రమ్ చెప్పాడు.
అందుకు విక్రం అన్నం పూర్తిగా తగ్గించేశాడని సమాచారం. ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలోని 'అన్నియన్'లో రెమో, అంబి, అన్నియన్‌గా మూడు పాత్రల్లో కనిపించిన విక్రం.. ఇందులోనూ అలానే కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది. . ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారు. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.


Click it and Unblock the Notifications












