యూట్యూబ్‌లో తన క్లిప్స్ వద్దంటూ పవర్ స్టార్

'పవర్‌స్టార్' అంటే తమిళ ప్రజలకు టకీమని గుర్తుకొచ్చే నటుడు డాక్టర్ శ్రీనివాసన్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'సుమ్మా నచ్చును ఇరుక్కు' ఆడియో విడుదల చెన్నైలో జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎస్‌ఏ చంద్రశేఖర్, ప్రముఖ సంగీత దర్శకులు తమన్, విజయ్ ఆంటోనీ, జీవీ ప్రకాశ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అచ్చు స్వరాలు సమకూర్చిన పాటల సీడీని జీవీ ప్రకాశ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా పవర్‌స్టార్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల్లోనూ నాకు అభిమానులున్నారు. నేను నటించిన 'కన్నా లడ్డు తిన్న ఆశయా'ను వారే పెద్ద హిట్ చేశారు అన్నారు. మొన్న సంక్రాంతికి విడుదలైన 'కన్నా లడ్డు తిన్న ఆశయా'తో పవర్‌స్టార్ డాక్టర్ శ్రీనివాసన్ హాస్యనటుడిగా మంచిపేరు సంపాదించుకున్నాడు.
దాంతో ఆయన వేరే వారి సినిమాలో ప్రత్యేక గీతంలో చిందులేశారు. పి.టి.సెల్వకుమార్ దర్శకత్వంలో వినయ్, లక్ష్మీరాయ్ జంటగా వస్తున్న తాజా చిత్రం 'ఒన్బదుల గురు'. ప్రేమ్‌జీ, సత్యన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన గీతంలో పవర్‌స్టార్‌ను నటింపజేశారు. ఇది సినిమాలో కీలకమైనదని దర్శకుడు చెబుతున్నాడు. పవర్‌స్టార్ రాకతో సెట్ హాస్య పందిరిగా మారిందని, దర్శకుడి సూచనలకు అనుగుణంగానే పవర్‌స్టార్ కూడా అడుగులేశాడట. యువతను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.


Click it and Unblock the Notifications











