twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథా చౌర్యం కేసులో విక్రమ్, అనుష్క చిత్రం

    By Srikanya
    |

    చెన్నై: విక్రమ్, అనుష్క కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం శివ తాండవం. ఈ చిత్రం కథ తనదేనంటూ ఓ అసెస్టెంట్ డైరక్టర్ కేసు పెట్టారు. ఈ విషయమై యూటీవీ సిఇవో ధనుంజయ్ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఆ అసెస్టెంట్ డైరక్టర్ వచ్చి కథ చెప్పటం నిజమేనని, అయితే తాను కథ నచ్చక రిజెక్టు చేసానని స్పష్టం చేసారు. అలాగే తాము చేస్తున్న శివతాండవం కథకూ,ఆ అసెస్టెంట్ డైరక్టర్ కధకూ ఒకటే పోలిక అని.. అది రెండు కథలో హీరో గుడ్డి వాడు కావటమేనని, అంతకుమించి పోలిక లేదని, కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

    విజయ్ దర్సకత్వంలో రూపొందుతున్న శివ తాండవం చిత్రంలో విక్రమ్ విజువల్లీ ఛాలెంజెడ్ పాత్ర చేస్తున్నారు. విక్రమ్‌, జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి. కళ్యాణ్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే రా ఏజెంట్ గానూ విక్రమ్ మరో పాత్రలో కనిపించనున్నారు.

    ఇక దర్శకుడు విజయ్ ఈ పాత్ర విషయమై మాట్లాడుతూ... విక్రమ్ పాత్రం.. డానియల్ కిష్ చెప్పిన శభ్దాలతో చూడటం అనే అంశం మీద ఆధారపడి రూపొందించాం అన్నారు. అనుష్క, యామీ జాక్సన్‌, లక్ష్మీ రాయ్‌, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్‌, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్‌, ఢిల్లి గణేష్‌ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో ఆగస్ట్‌ రెండవ వారంలో ఆవిష్కరించి, సెప్టెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇది తన 41వ చిత్రమని ఎక్కువ కేంద్రాల్లో విడుదల చేయదలచానని నిర్మాత సి. కళ్యాణ్‌ అన్నారు.

    నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇందులో విక్రమ్ పూర్తి వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రణ వుంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. జగపతిబాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్షికమాలు జరుగుతున్నాయి' అన్నారు.

    షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    With an assistant director claiming that the script of Vikram’s upcoming film Thandavam was his, the makers of the film are in a fix. Dhananjayan, CEO of UTV Motion Pictures which is producing the film, has a different version to offer in this issue. “This person came to me some time back and narrated a script to me after which I told him that we had selected some other script as the theme of our next film. The only similarity in our script and the script I heard from this person was a blind man’s character. Other than this, our script was entirely different from his script".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X