ఆఫర్స్ కోసం నేను విప్పి చూపించలేను..సారి అంటోంది
సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా నాకు పెద్ద నష్టమేం లేదు...కానీ ఎక్స్‌పోజింగ్‌కు మాత్రం చేయలేను..చేయను అంటోంది శరణ్యా మోహన్.'భీమిలి కబడ్డీ జట్టు" 'విలేజ్‌లో వినాయకుడు" 'కత్తి" చిత్రాలలో తెలుగువారికి దగ్గరైన శరణ్యా మోహన్ కి ఆ తర్వాత ఒక్క ఆఫరు కూడా రాలేదు.ఆమెను మీడియావారు కలిసి ..ఎక్స్‌పోజింగ్ చేయకపోతే సినిమాల్లో అవకాశాలు ఉండవు కదా. దానికి తోడు మీరు చాలా పొట్టిగా ఉంటారు? కదాని అడిగితే నాకు తగ్గ అవకాశాలు నాకొస్తాయి.సినిమాల్లో నటిస్తోంది కేవలం నాలోని ప్రతిభను చూపించటానికే కానీ నా శరీరాన్ని చూపించడానికి కాదని స్పష్టం చేసింది.మరి ఆమె నటనను మెచ్చి ఏ దర్శక,నిర్మాత అయినా ముందుకొచ్చి సినిమా ఇస్తాడేమో చూడాలి.అయినా శరణ్యామోహన్ ఎక్సపోజింగ్ చేస్తే మాత్రం ఎవరు చూస్తారనేది అస్సలు ప్రశ్న.ప్రస్తుతం తమిళంలో ఆమె విజయ్ చిత్రం వేలాయుధంలో అతని సోదరిగా నటిస్తోంది. వేలాయుధమ్ చిత్రం తెలుగులో నాగార్జున చేసిన అజాద్ చిత్రానికి రీమేక్.


Click it and Unblock the Notifications