»   » త్రిషపై ఆ రూమర్ పుట్టడానికి కారణం రమ్యకృష్ణేనా?

త్రిషపై ఆ రూమర్ పుట్టడానికి కారణం రమ్యకృష్ణేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రమ్యకృష్ణ తమిళంలో తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మించనున్న చిత్రంలో తాను నటించడం లేదని త్రిష స్పష్టం చేసింది. అలాగే ఈ రూమర్ ఎలా వచ్చిందో తనకు తెలియదని అంది. అయితే తమిళ పరిశ్రమలో మాత్రం ఈ రూమర్ పుట్టడానికి రమ్యకృష్ణ కారణమని అంటున్నారు. త్రిష, రమ్యకృష్ణ స్నేహితులు కావంటంతో తను నిర్మాతగా మారి తన భర్తని తమిళానికి దర్శకుడుగా పరిచయం చేస్తూ చేసే సినిమాలో త్రిషను అడిగితే కాదనదనే ధైర్యంతో రెండు మూడు చోట్ల త్రిష తమ సినిమాలో చేస్తుందని చెప్పటంతో ఆ వార్త బయిటకు వచ్చిందని అంటున్నారు. అయితే త్రిష మాత్రం స్నేహం..స్నేహమే అని ఆ వంకతో తన రెమ్యునేషన్ మాట్లాడుకోకుండా డేట్స్ ఇవ్వటం లేదన్నది చెప్పటానకే..ఈ చిత్రం విషయమై తననెవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తమిళంలో అజిత్ సరసన మంగాత్తా చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని తెలిపింది. తెలుగులో వెంకటేష్ సరసన ఒక చిత్రం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

English summary
‘As of now, there has been no such offer or talks regarding a movie with Ramya Krishna. This is completely baseless rumor,’ said hot Trisha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu