భారతీయుడు 2 మూవీలో సిద్ధార్థ్ రోల్ కి ముందు అనుకున్న వేరే హీరో..ఆ స్టార్ ఎవరో తెలుసా?
ఈ ఏడాదిలో సౌత్ ఇండియన్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు కొంచెం తక్కువే అని చెప్పాలి. అయితే ఈ చిత్రాల్లో ఈ జూన్ వరకు సరైన సినిమాలే రాలేదు. కాగా జూన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "కల్కి 2898 ఎడి" థియేటర్స్ లోకి వచ్చి భారీ వసూళ్లు అందుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా అలరించింది.
ఇలా ఈ సినిమా ఇచ్చిన ఊపుతో పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన మరో సినిమానే "భారతీయుడు 2". ఇదే కల్కి 2898 ఎడి నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన "భారతీయుడు 2" కూడా ఒకటి. కమల్ అలాగే శంకర్ కాంబినేషన్ లో 1996 లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రం భారతీయుడు కి సీక్వెల్ గా ఇది వచ్చింది.

అప్పట్లోనే 50 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రంకి సీక్వెల్ అనేసరికి చాలా మంది ఎగ్జైట్ అయ్యారు కానీ భారతీయుడు 2 మాత్రం దారుణంగా విఫలం అయ్యింది. కాగా రీసెంట్ గా ఓటిటిలో కూడా సినిమా వచ్చింది కానీ ఇక్కడ వచ్చాక మరిన్ని ట్రోల్స్ పడ్డాయి. అయితే ఈ చిత్రంలో కమల్ హాసన్ కాకుండా యువ హీరో సిద్ధార్థ్ కూడా మెయిన్ రోల్ లో సినిమా అంతా సాగుతాడు.
కమల్ తో సమానమైన ఎమోషనల్ పాత్రని శంకర్ అతడికి డిజైన్ చేశారు. దానిని తాను కూడా బాగానే చేసేసాడు. అయితే ఈ చిత్రంలో సిద్ధార్థ్ రోల్ కి అతడు మొదటి ఛాయిస్ సిద్ధార్థ్ కాదంట. తన ప్లేస్ లో శంకర్ మరో ప్రముఖ హీరోని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కూడా కాదు మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసిన నటుడు శివ కార్తికేయన్ అట.

కాగా మొదట శంకర్ సిద్ధార్థ్ ప్లేస్ లో శివ కార్తికేయన్ ని అనుకున్నారట. కానీ అప్పటికి శివ కార్తికేయన్ మెయిన్ హీరోగా చాలా సినిమాలు మూలాన డేట్స్ కుదరక తాను మిస్ చేసుకున్నాడట. సో ఆ తర్వాత సిద్ధార్థ్ కి ఛాయిస్ వచ్చినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి కరెక్ట్ గా ఆలోచిస్తే ఈ రోల్ కి సిద్ధార్థ్ తో పాటుగా శివ కార్తికేయన్ కూడా బాగానే సెట్ అవుతాడు అని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ లు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం తర్వాత శంకర్ భారతీయుడు 3ని కూడా ప్లాన్ చేశారు. కాగా ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం వచ్చే ఏడాదికి విడుదల కానుంది. ఇండియన్ 2 విడుదల అయ్యాక లాస్ట్ లో ప్లే చేసిన ఇండియన్ 3 ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ నే వచ్చింది. కానీ ఇండియన్ 2 దారుణంగా విఫలం అవ్వడంతో పార్ట్ 3 పై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











