ప్రియురాలిని పెళ్లాడిన విజయ దేవరకొండ డైరెక్టర్... ఏడాది తిరుగకముందే సీక్రెట్‌గా..

దక్షిణాది డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఇటీవల ఓ ఇంటి వాడయ్యాడు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ తన ప్రియురాలిని ఇటీవల వివాహం చేసుకొన్నారు. ఆనంద్ వివాహం విషయం కొంత ఆలస్యంగా మీడియాలో వెలుగు చూసింది. విక్రమ్, విజయ్ దేవరకొండతో రూపొందించిన సినిమాలకు ఈయన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం ఆయన చివరి చిత్రం. ఆనంద్ పెళ్లి గురించి మరిన్ని వివరాలు...

 ఏఆర్ మురుగదాస్ శిష్యుడిగా

ఏఆర్ మురుగదాస్ శిష్యుడిగా

దర్శకుడు ఆనంద్ శంకర్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించడం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కలైపులి థాను రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ అరిమా నంబీ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నది.

దుబాయ్ అమ్మాయితో ప్రేమలో

దుబాయ్ అమ్మాయితో ప్రేమలో

కొద్దికాలంగా దివ్యాంక అనే దుబాయ్ అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారు. గతేడాది దుబాయ్‌కు వెళ్లిన ఆనంద్ తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేయడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయి. ఆ సందర్బంగా ఈమె నా ప్రియురాలు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తొలిపోస్టు. మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

 ఏడాది తిరగకముందే పెళ్లి

ఏడాది తిరగకముందే పెళ్లి

ప్రేమ యాత్ర సుదీర్ఘంగా సాగుతుందని భావించిన అభిమానులకు ఆనంద్ శంకర్ ఝలక్ ఇచ్చారు. ప్రపోజ్ చేసిన తర్వాత ఏడాది తిరగకముందే తన ప్రియురాలు దివ్యాంక మెడలో మూడు మూళ్లు వేశాడు. ఇక త్వరలో హానీమూన్ తర్వాతే కెరీర్‌పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆనంద్ శంకర్ విషయానికి వస్తే, ప్రముఖ రంగస్థల కళాకారుడు కోమల్ స్వామినాథన్ మనువడు అనే విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండతో నోటా మూవీ

విజయ్ దేవరకొండతో నోటా మూవీ

తాజాగా విజయ్ దేవరకొండతో నోటా చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు సంబంధించిన కథలను హీరోలతో పంచుకొంటున్నట్టు తమిళ పత్రిక వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X