తమన్నా తొక్కలా ఉంటుందని తేల్చిన దర్శకుడు
నా దృష్టిలో తమన్నా యావరేజ్ ఆర్టిస్ట్. అంత అందగత్తె కూడా కాదు. నయనతార, త్రిష, అసిన్‌ల శారీరక భాషతో పోల్చితే తమన్నా బాడీ లాంగ్వేజ్ అంత బాగుండదు. ఇది నా అభిప్రాయం. తమన్నా 'సూపర్' అనే అభిప్రాయం చాలామందికి ఉండి ఉండొచ్చు. అది వాళ్ల అభిప్రాయం అంటున్నారు తమిళ దర్శకుడు సోలైరాజా. ఆయన రీసెంట్ గా తను డైరక్ట్ చేసిన 'నీయుమ్ నానుమ్' చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఇటీవల చెన్నయ్‌లో మీడీయా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా స్పందించారు. అదేంటి మీకూ తమన్నాకీ ఏమన్నా పొరపొచ్చాలు వచ్చి అలా అన్నారా అని క్లారిఫై అడిగితే...నేను తమన్నా మంచి నటి కాదు..అందగత్తె కాదు అన్నంత మాత్రాన తనకు మైనస్ అవ్వదు. ఆల్రెడీ తను అగ్ర స్థానాన్ని చేరుకున్నారు కదా. ఇకపోతే పోలికలు చేసినప్పుడు ఎవరైనా సరే అగ్రస్థానంలో ఉన్నవాళ్లతోనే పోల్చుకుంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే.. తమన్నా గురించి నా అభిప్రాయం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. భవిష్యత్‌లో కూడా తనను హీరోయిన్ గా నేను ఎంపిక చేసే అవకాశమే లేదు' అన్నారు. ఇక తమన్నా, కార్తి కాంబినేషన్లలో లింగుస్వామి రూపొందించిన ఆవారా చిత్రం క్రితం వారం రిలీజై ఫరవాలేదించుకుంది. అలాగే తమన్నా ప్రస్తుతం నాగచైతన్య సరసన సుకుమార్ దర్సకత్వంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











