సమంత ని కాదని నస్రియాని తీసుకున్నారు

By Srikanya

చెన్నై : చూస్తూంటే నస్రియా..పూర్తిగా సమంతకు పోటీ ఇచ్చేటట్లు ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'నేరం'తో నస్రియా మలయాళ భామ కోలీవుడ్‌కు పరిచయమైంది. ఇప్పుడు యువ హీరోలందరూ ఈమెతో ఆడిపాడేందుకు పోటీ పడుతుండటంతో వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్‌ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఇలయ తలబది' కూడా అంగీకారం తెలపటంతో ఆమె పేరును త్వరలోనే అధికారికంగానూ ప్రకటించనున్నారు. మొదట ఈ చిత్రంలో సమంత ను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి నస్రియా వచ్చి చేరింది.

విజయ్‌ మరో కొత్త హీరోయిన్ తో రొమాన్స్‌ చేయనున్నాడా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో 'తుపాకి'తో ఘన విజయాన్ని అందుకున్నాడు 'ఇలయ తలబది'. కోలీవుడ్‌లో 'రోబో' తర్వాత ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ఇది పేరొందింది. ఏఆర్‌ మురుగదాస్‌-విజయ్‌ కాంబినేషన్‌లో త్వరలోనే మరో కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్ కోసం పలువురి పేర్ల పరిశీలనలో ఉన్న నేపథ్యంలో తాజాగా నస్రియాను ఎంపిక చేసినట్లు సమాచారం.

Nazriya Nazim

అలాగే ఎన్టీఆర్ తాజా చిత్రంలోనూ సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎంపికచేసినట్లు తెలుస్తోంది.ఆయన తర్వాతి సినిమా 'రభస'లో మళయాలం హీరోయిన్ నజ్రియాను సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆమె వయసు 19 సంవత్సరాలు మాత్రమే అని ఇండస్ట్రీ టాక్. ఇంతకు ముందు సెకండ్ హీరోయిన్ స్థానంలో కేథరిన్, నందిత పేర్లు వినిపించాయి. ఇప్పుడు నజ్రియా పేరు తెరపైకి వచ్చింది. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన నజ్రియా పలు చిత్రాల్లో నటించింది. ఆమె ఇప్పుడు మేజర్ కావడంతో హీరోయిన్ అవకాశాలూ వస్తున్నాయట. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ఖరారు కానప్పటికీ...'రభస' అనే పేరు ప్రచారంలో ఉంది.

ఈ అమ్మడు కేరళకుట్టి. 'నేరం' అనే చిత్రంతో తంబిలను మెప్పించడానికి వచ్చింది. అందం, అభినయం పుష్కలంగా ఉండడంతో స్టార్ హీరోల చిత్రాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పడు తెలుగులోనూ హాట్ కేక్ గా మారింది. అందరు పెద్ద హీరోల దృష్టీ ఆమెపైనే పడింది. నస్రియా ఇప్పటికే ధనుష్‌ సరసన 'నయ్యాండి', కార్తీకి జంటగా రంజిత్‌ తెరకెక్కించనున్న చిత్రంలో, జీవాకు జోడీగా 'నీ నల్లా వరువేడా'ల్లో ఎంపికవటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X