నిర్మాతగా మారిన రామ్ చరణ్ 'బ్రూస్ లీ' విలన్
చెన్నై : ఆ మధ్య వచ్చిన అజిత్ చిత్రం 'ఎన్నై అరిందాల్'(ఎంత వారుగానీ) చిత్రంలో విలన్ గా నటించిన అరుణ్ విజయ్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో ఫైట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ మల్టి మిలియనీర్ పాత్రను చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా అతని లుక్ ని డిజైన్ చేసారు. ఈ సినిమాలో తనకు పెయిర్ ఎవరూ ఉండరని, కేవలం తను నెగిటివ్ రోల్ లో కనపడతానని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆయన నిజ జీవితంలో నిర్మాత గా టర్న్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రస్తుతం తమిళ పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోలు నిర్మాతల అవతారమెత్తుతున్నారు. సూర్య '2 డి'; విశాల్ 'విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ', ధనుష్ 'వండర్‌బార్', విజయ్‌సేతుపతి 'విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్' సంస్థల పేరిట ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కూడా నిర్మాత అవతారమెత్తారు. ఈ జాబితాలో తాజాగా అరుణ్ విజయ్ కూడా చేరారు.
'ఇన్ సినిమాస్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరిట ఆయన చిత్రాలు తీయనున్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. కొత్త కళాకారులను పరిచయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిభావంతులైనా నిరూపించుకోవడానికి అవకాశాల్లేని యువకులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

గౌతం మేనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన 'ఎన్నై అరిందాల్'లో ప్రతినాయకుడి పాత్ర ద్వారా కోలీవుడ్‌లో అరుణ్ విజయ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన నటించిన 'వా' త్వరలో విడుదల కానుంది. త్వరలో గౌతం మేనన్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం శింబుతో 'అచ్చం ఎన్బదు మడమైయడా' అనే సినిమాను గౌతం మేనన్ తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాక అరుణ్ విజయ్ కొత్త చిత్రం ప్రారంభంకానుంది.
అరుణ్‌విజయ్ మాట్లాడుతూ.... ఏ పాత్రలో నటించినా... ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో నటించడానికి ఇష్టపడతా. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి హీరోగా మాత్రమే నటించాల్సిన అవసరం లేదు. నెగటివ్ రోల్‌లో కూడా నటించొచ్చు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలోని తెలుగు చిత్రంలో నటిస్తున్నా. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎక్కువ రిస్కుతో కూడిన సన్నివేశాల్లో నటిస్తున్నా. ఈ యాక్షన్ సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయన్నారు.
ఇక రాంచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు ప్రధాన పాత్రల్లో శీను వైట్ల దర్శకత్వంలో ఈ బ్రూస్ లీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డి.వి..వి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. అరుణ్ విజయ్ కనిపించే రామ్ చరణ్ టీజర్ ని ఇక్కడ చూడండి.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











